Headlines

Korean Kanakaraju Trailer: వరుణ్ తేజ్ యాక్టింగ్ బీభత్సం.. అదిరిపోయిన కొరియన్ కనకరాజు ట్రైలర్..

Korean Kanakaraju Trailer: వరుణ్ తేజ్ యాక్టింగ్ బీభత్సం.. అదిరిపోయిన కొరియన్ కనకరాజు ట్రైలర్..


టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో కొరియన్ కనకరాజు ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 7న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో వరుణ్ జోడిగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కొరియన్ కనకరాజు ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన ట్రైలర్ లో సత్య కామెడీ టైమింగ్, యాక్టింగ్ సినిమాలో హైలెట్ అనే చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

సత్య కామెడీ సీన్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా సాగింది. కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలలో నటించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే మురళీధర్, సత్య, వరుణ్ తేజ్ కామెడీ ఆకట్టుకోగా.. చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు కామెడీ సైతం హైలెట్ అయ్యింది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

అనంతపురం యువకుడిగా మాస్ లుక్ లో.. మరోవైపు కొరియన్ మాఫియా డాన్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్య కామెడీ పంచులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.’

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

కొరియన్ కనకరాజు ట్రైలర్..



ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *