Headlines

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నేటి నుంచే రెడీగా ఉండండి.. ఒకేసారి..

Ration Card: రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నేటి నుంచే రెడీగా ఉండండి.. ఒకేసారి..


రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్ అందింది. మూడు నెలల సరుకులు ఒకేసారి పంపిణీ చేయనున్నారు అధికారులు. వర్షాభావ పరిస్థితుల క్రమంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఈ నెలలోనే అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ను ఒకేసారి అందిస్తోంది. నేటి నుంచి ఈ పంపిణీ కార్యక్రమం మొదలవ్వగా.. ఈ నెల 15వ తేదీ వరకు అందించనుంది. దీంతో లబ్దిదారులు ఈపాస్ మెషిన్‌లో తన బయోమెట్రిక్‌ను నమోదు చేసి తమ కోటాకు సంబంధించిన రేషన్ తీసుకోవచ్చు. అయితే మూడుసార్లు బయోమెట్రిక్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎల్‌నివో ప్రభావం కనిపిస్తుండటం, వర్షాభావ పరిస్థితులు క్రమంలో ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తున్నారు.

ఇప్పటికే రేషన్ సరఫరా

ఇప్పటికే రేషన్ దుకాణాలకు బియ్యం చేరుకున్నాయి. మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి దుకాణాలకు సరఫరా అవుతున్నాయి. చిన్న రేషన్ దుకాణాలకు ఒకేసారి మొత్తం రవాణా చేయనుండగా.. పెద్ద షాపులకు రెండుసార్లు సరఫరా చేయనున్నారు. గతంలో ఎండల దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేపట్టారు. జులై నెలకు సంబంధించిన కోటాను ఎప్పటిలాగే అందించారు. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ రేషన్ ఒకేసారి అందిస్తున్నారు. లబ్దిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మూడు నెలల రేషన్ పంపిణీని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలల రేషన్ ఒకేసారి అందించాలంటే రేషన్ షాపుల్లో బియ్యం స్టోరేజ్ కోసం ఎక్కువ స్థలం అవసరం. కానీ రేషన్ దుకాణాలు చిన్నగా ఉండటం వల్ల స్టాక్ భద్రపరించేందుకు స్థలం సరిపోవడం లేదు. దీంతో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మొరాయిస్తున్న ఈ-పాస్ యంత్రాలు

ఒకేసారి మొత్తం స్టాక్‌ను భద్రపర్చడం తమకు భారమవుతుందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వేలిముద్రల నమోదులో కూడా జాప్యం జరుగుతోంది. ఒకేసారి మూడుసార్లు వేలిముద్రలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పాస్ యంత్రాలు కొన్నిసార్లు పనిచేయకుండా మొరాయిస్తున్నాయి. దీంతో రేషన్ పంపిణీ ఆలస్యమవుతుందని రేషణ్ డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక్కొ కార్డుదారుడికి మూడు నెలల రేషన్ అందించాలంటే 15 నుంచి 20 నిమిషాల సమయ పడుతుంది వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ పాస్ మెషీన్లలో సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *