Headlines

Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..


Andhra: ఏపీలో వర్షాలు కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాతావరణ శాఖ వివరాల ప్రకారం, నిన్నటి వరకు సుమారు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి కొనసాగిన తూర్పు-పశ్చిమ షియర్ జోన్ (గాలుల కోత) బలహీనపడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కొనసాగే పరిస్థితులు నెలకొన్నాయి.

ఉత్తర కోస్తాలో భారీ వర్షాల సూచన

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండగా, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రెండు రోజులూ బలమైన గాలులు కొనసాగుతాయని తెలిపింది.

దక్షిణ కోస్తాలోనూ వర్షాలు

దక్షిణ కోస్తా జిల్లాల్లో శనివారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. ఆదివారం ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఎల్లుండి కూడా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు

రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, ఆది, సోమ వారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరం లేనప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు, మత్స్యకారులు, ప్రయాణికులు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *