ఆషాఢ మాసంలో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా కాళ్లు, కీళ్ల నొప్పులు, జ్వరం వంటి సమస్యలతో సతమతం అవుతారు. అయితే ఈ మేక కాళ్ల సూప్ తాగడం వలన ఆ సమస్యల అన్నింటి నుంచి కూడా కోలుకోవడానికి హెల్ప్ అవుతుందంట. ముఖ్యంగా మేక కాళ్ల సూప్‌లో కాల్షియం, కొలాజెన్, గ్లూకోసమైన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది అర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.