Headlines

ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఈసారి ఏమన్నారంటే..?

ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ఈసారి ఏమన్నారంటే..?


దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశ పరీక్షల్లో వరుసగా వెలుగుచూసిన పేపర్ లీక్ ఘటనలకు కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (Prevention of Unfair Means) సవరణ బిల్లు–2026 కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బుధవారం (జూలై 29) లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, గురువారం (జూలై 30) రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘ఇండియా’ కూటమికి చెందిన పలు ప్రతిపక్ష పార్టీలు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినప్పటికీ బిల్లు ఆమోదం పొందింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసి పేపర్ లీక్‌లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. దేశంలో విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్‌ట్రాక్ విచారణలు, రాష్ట్రాల సూచనల ఆధారంగా చట్టాన్ని మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో పేపర్ లీక్‌లు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని ప్రధాని స్పష్టం చేశారు.

కొత్త చట్టం ప్రకారం పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే రూ.50 లక్షల వరకు జరిమానా విధించేందుకు నిబంధనలు ఉన్నాయి. వ్యవస్థీకృతంగా పేపర్ లీక్ ముఠాలను నిర్వహించడం, భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడటం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా బిల్లులో కఠిన నిబంధనలు చేర్చారు. పేపర్ మాఫియాపై ఎలాంటి మినహాయింపులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించి పరీక్షల నిర్వహణను మరింత భద్రంగా మార్చాలని, అదే సమయంలో పేపర్ లీక్‌ల వెనుక ఉన్న ముఠాలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ యువత ఆశయాలను కాపాడేందుకు ఈ చట్టం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ బిల్లును స్వాగతిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఇదొకటని ఆయన అన్నారు. పబ్లిక్ పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టం రూపొందిందని, మెరిట్ ఆధారిత వ్యవస్థను బలోపేతం చేసి యువత తమ ప్రతిభతోనే విజయాలు సాధించే వాతావరణాన్ని ఇది కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *