50MP సోనీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, శక్తివంతమైన 5,500mAh బ్యాటరీతో రూపుదిద్దుకున్న ఈ వివో ఫోన్ ఫ్లిప్కార్ట్‌లో రూ. 24,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు సొంతం చేసుకునే వెసులుబాటు ఉన్న ఈ అద్భుతమైన డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అత్యంత స్మూత్‌గా సాగుతాయి. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో పాటు రాయల్ బ్రోంజ్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లు ఈ ఫోన్‌కు సరికొత్త ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. దీనిలోని మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. రోజువారీ మల్టీటాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను ఇది ఎంతో సులభంగా నిర్వహించగలదు.
ఏఐ ఫీచర్లు
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో అత్యుత్తమ కెమెరా సెటప్‌ను అమర్చారు. వెనుక భాగంలో 50MP సోనీ IMX882 OIS మెయిన్ కెమెరాతో పాటు మరో 8MP అల్ట్రా-వైడ్ కెమెరాను పొందుపరిచారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP ఐ ఏఎఫ్ (Eye AF) ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వీటితో పాటు ఏఐ పోర్ట్రైట్ సూట్, ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్హాన్సర్, ఒరా లైట్ పోర్ట్రైట్, 4K వీడియో రికార్డింగ్ వంటి అధునాతన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ
రోజంతా నిరంతరం పనిచేసేలా ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. దీనికి 80W ఫ్లాష్‌ఛార్జ్ (FlashCharge) సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.
భారత మార్కెట్లో ఈ ఫోన్ 8GB + 128GB, 8GB + 256GB అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో 8GB + 128GB బేస్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. అంతేకాకుండా వివిధ బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.