Headlines

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!


కరోనాను మించిన మహమ్మారిలా మారింది సైబర్‌ క్రైమ్‌. రోజుకో సరికొత్త వేరియంట్లతో జనాలను కరోనా వేధిస్తున్నట్టే.. సైబర్‌ కేటుగాళ్లు కూడా కొత్త కొత్త ఐడియాలతో జనాలను నిండాముంచేస్తున్నారు. తాజాగా..పార్శిల్ డెలివరీ పేరుతో దేశవ్యాప్తంగా కొత్త తరహా ఫిషింగ్ సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ కొత్త మోసం ఏంటంటే..మీకు ఓ పార్శిల్‌ వచ్చింది.. దానిపై మీ చిరునామా తప్పుగా ఉంది.. కనుక రూ.22 చెల్లించి రీషెడ్యూల్ చేసుకోండి అంటూ ఇండియా పోస్ట్ పేరుతో ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నారు. నిజమే అని భావించి ఎమౌంట్‌ పే చేయగానే.. ప్రజల జీవితకాల సంపాదనను కొల్లగొడుతున్నారు. ఆ మెసేజ్‌లో ఉండే లింక్ అధికారిక వెబ్‌సైట్‌లాగే కనిపిస్తుండటంతో చాలామంది నమ్మి క్లిక్ చేస్తున్నారు. అయితే ఆ ఒక్క క్లిక్‌తోనే బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి క్షణాల్లో ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోనే వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన ఒక కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఏకంగా రూ.23.26 లక్షలు, బంజారాహిల్స్‌కు చెందిన మరో వ్యక్తి రూ.2.49 లక్షలు ఈ తరహా మోసానికే బలయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ తో పాటు సైబర్ భద్రతా నిపుణులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఎస్‌ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వ్యక్తిగత వివరాలు, ఓటీపీలను అడగదని స్పష్టం చేస్తున్నారు. ఏదైనా సమాచారం ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లోనే పరిశీలించాలని సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించడం అత్యంత కీలకం. డబ్బులు కట్ అయిన గంటలోపే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో నమోదు చేస్తే 80 నుంచి 90 శాతం వరకు నిధులు తిరిగి రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన మనీ రిస్టోరేషన్ మాడ్యూల్ ద్వారా ఫ్రీజ్ అయిన బాధితుల సొమ్మును సులభంగా తిరిగి పొందే వెసులుబాటు కూడా అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *