Headlines

Ranabali: రౌడీ హీరో ప్లానింగ్‌.. రణబాలి రిలీజ్‌కు బిగ్‌ స్కెచ్‌

Ranabali: రౌడీ హీరో ప్లానింగ్‌.. రణబాలి రిలీజ్‌కు బిగ్‌ స్కెచ్‌


విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ టార్గెట్ రీచ్ అవుతాడా..? ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా భారీ అంచనాలతో వచ్చే పాన్ ఇండియా సినిమాలకు రిలీజ్ డేట్ అనేది చాలా కీలకం. ఏమాత్రం తేడా వచ్చినా కలెక్షన్స్‌ మీద ఆ ఎఫెక్ట్ గట్టిగా పడుతుంది. అందుకే విజయ్ ‘రణబాలి’ మేకర్స్ రిలీజ్ విషయంలో ఒక పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఇంతకీ రణబాలి టీమ్‌ ప్లానేంటి..? టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో రణబాలి ఒకటి. విజయ్, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ పీరియడ్ డ్రామాను సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా క్వాలిటీ, వీఎఫ్ఎక్స్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకూడదని మేకర్స్ డిసైడ్ అయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఇంకాస్త టైమ్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. హడావుడిగా రావడం కన్నా పండుగ సీజన్‌లో రావడం మార్కెట్ పరంగా సేఫ్ అన్న నమ్మకంతో కొత్త ప్లాన్ రెడీ చేశారు. సెప్టెంబర్ 11 డేట్‌ మిస్ అయితే దసరా సీజన్‌లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ దసరా రేసు నుంచి తప్పుకుంటే, అక్టోబర్ 16న దసరా కానుకగా రణబాలిని బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. ఆ డేట్ కుదరని పక్షంలో.. నవంబర్ 6న దీపావళికి గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పండుగ సెలవులను వాడుకుంటూ పాన్-ఇండియా రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించాలనేది రణబాలి టీమ్ స్కెచ్‌. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఆడియన్స్‌లోనూ రణబాలి మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ పవర్‌ఫుల్ విలన్‌గా చేస్తుండటం సినిమా మీద గ్లోబల్‌ రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తోందిజ. 1870 నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. మరి ఆ కష్టం, రిలీజ్ ప్లానింగ్‌ కలిసి రౌడీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఇస్తాయేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *