Headlines

Yash: రామాయణ ట్రైలర్ వాయిదా.. సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్

Yash: రామాయణ ట్రైలర్ వాయిదా.. సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేసిన యశ్


రాకింగ్ స్టార్ యష్ గ్లోబల్ ప్రమోషన్స్‌లో అదరగొడుతున్నారు. దర్శకుడు నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ టీమ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తోంది. శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌లో పాల్గొన్న రాకీ భాయ్ సినిమా విశేషాలు పంచుకున్నారు. హీరో రణ్‌బీర్ కపూర్‌ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఆ కామెంట్స్‌ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. రాకింగ్ స్టార్ యష్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ, రావణుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ గ్లోబల్ ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి. ఈ మూవీ టీమ్ అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేడుకల్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఈవెంట్‌లో యష్‌తో పాటు దర్శకుడు నితీశ్ తివారీ, హీరో రణ్‌బీర్ కపూర్, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ ఇంటర్నేషనల్ వేదికపై బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌ ఆకాశానికెత్తేశారు యష్‌. సిల్వర్ స్క్రీన్ మీద రాముడి పాత్రను పోషించడం ఎంతో కష్టమని, కానీ రణ్‌బీర్ కపూర్ ఆ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారన్నారు యష్. ఈ పవర్‌ఫుల్ రోల్ కోసం రణ్‌బీర్ చాలా కష్టపడ్డాడని, సినిమాలో అతడి డెడికేషన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి భారీ విజువల్ వండర్‌ను తెరకెక్కించాలంటే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు.. గట్టి సంకల్ప బలం కూడా ఉండాలన్న యష్, సరైన టీమ్ కుదిరినప్పుడు ప్రతిదీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందంటూ తన అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి తమ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను కొత్తగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టామని యష్ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు ఈరోజు రిలీజ్ కావాల్సిన ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్‌ వాయిదా పడింది. ఈ ట్రైలర్‌ను మరింత గ్రాండ్‌గా, ఇంటర్నేషనల్ లెవల్‌లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్… చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌ డీలా పడిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

ట్రెండ్‌ మారింది గురూ.. వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *