Headlines

Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..

Chiranjeevi: ‘గబ్బర్ సింగ్’ రమేష్‌కు అండగా మెగా ఫ్యామిలీ.. తక్షణ సాయంగా 5లక్షల చెక్కుతో పాటు..


‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి.. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నాగబాబు మరో రూ. 2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. నటుడు రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు. అంతకు ముందు రమేష్ విషయం తెలుసుకున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వెంటనే అపోలో ఆస్పత్రికి వచ్చాడు. రమేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.

కాగా 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘గబ్బర్ సింగ్’ తోనే  తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు రమేష్. అందులో విలన్ గ్యాంగ్ లో ఒక సభ్యుడిగా రమేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో వచ్చే అంత్యాక్షరి కామెడీ ఎపిసోడ్ లో రమేష్ నటన, ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ను కట్టి పడేశాయి. ఆ తర్వాత పవన్ కల్యాణే నటించిన అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లోనూ కామెడీ విలన్ పాత్రలు పోషించాడీ నటుడు.  అలాగే ఇతర హీరోల  సినిమాల్లోనూ కమెడియన్ గానూ, సహాయక నటుడిగానూ మెప్పించాడు.

ఇవి కూడా చదవండి



గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *