Headlines

మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


ఇంట్లో పంచదార లేదా తీపి పదార్థాలు కనిపించగానే క్షణాల్లో చీమలు చేరిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అంత చిన్న జీవులైనా, ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అత్యంత క్రమశిక్షణతో, ఒకే వరుసలో కదలడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైనా ఆటంకం ఎదురైతే తమ గుంపు మొత్తానికి సంకేతాలు పంపేంత చురుకైన ఈ చీమలు.. ఎప్పుడూ లైన్‌లోనే ఎందుకు ప్రయాణిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

రహస్య కెమికల్.. ఫెరోమోన్లు

చీమలు వరుస క్రమంలో నడవడానికి ప్రధాన కారణం అవి విడుదల చేసే ఫెరోమోన్లు అనే ప్రత్యేకమైన రసాయన పదార్థం. చీమలు తమ గూడు నుండి బయటకు వచ్చినప్పుడు, ప్రయాణించే మార్గంలో ఈ ఫెరోమోన్లు అనే రసాయనాన్ని విడుదల చేస్తూ వెళ్తాయి. ఇది ఒక ప్రత్యేకమైన వాసన రూపంలో ఉంటుంది. ముందు వెళ్లే చీమ విడుదల చేసిన ఈ రసాయన వాసనను పసిగడుతూ, వెనుక ఉన్న చీమలు దాని వెంటే ప్రయాణిస్తాయి. ఇలా ఒకదాని వాసనను మరొకటి అనుసరించడం వల్ల అవి అనుకోకుండానే ఒక చక్కటి వరుస క్రమాన్ని ఏర్పరుస్తాయి.

చూపు మందగించడం.. యాంటెన్నాలే సహాయం..

చీమల ప్రవర్తన వెనుక ఉన్న మరొక ఆసక్తికరమైన నిజం ఏంటంటే.. చీమలకు దృష్టి శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చూపు సరిగ్గా ఉండకపోవడం వల్ల అవి దారి తప్పకుండా ఉండటానికి తమ తలపై ఉండే యాంటెన్నాలపై ఆధారపడతాయి. ప్రయాణంలో ఈ యాంటెన్నాల ద్వారానే ఫెరోమోన్ల వాసనను పసిగడతాయి. అంతేకాకుండా ఒకదానికొకటి తాకుతూ సంకేతాలను ఇచ్చుకుంటూ, ఎక్కడా దారి తప్పకుండా ఒకే వరుసలో గమ్యస్థానానికి చేరుకుంటాయి.

చూడటానికి అతి చిన్న జీవులే అయినా.. ఫెరోమోన్లు అనే రసాయన సంకేతాలు, పరస్పరం సహకరించుకునే యాంటెన్నాల సహాయంతో చీమలు చూపే ఈ క్రమశిక్షణ శాస్త్రవేత్తలను సైతం విపరీతంగా ఆకట్టుకుంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *