Headlines

ఫ్యామిలీ కథలో ట్విస్ట్‌.. కాసులు కురిపిస్తున్న కొత్త ఫార్ములా

ఫ్యామిలీ కథలో ట్విస్ట్‌.. కాసులు కురిపిస్తున్న కొత్త ఫార్ములా


కోవిడ్ తరువాత వెండితెర మీద క్రైమ్ థ్రిల్లర్‌లకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అదే జానర్‌కు ఫ్యామిలీ సెంటిమెంట్‌ను కూడా జోడీస్తున్నారు మేకర్స్‌. సౌత్ ఇండస్ట్రీల్లో ఈ ట్రెండ్‌ గట్టిగా కనిపిస్తోంది. రీసెంట్‌ టైమ్స్‌లో ఈ జానర్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. టాప్‌ స్టార్స్‌కు పోటీ ఇచ్చే రేంజ్‌లో కాసుల పంట పండించాయి. ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అనగానే సౌత్‌లో ముందుగా గుర్తొచ్చే మూవీ ‘దృశ్యం’. ఓ సామాన్య మధ్యతరగతి తండ్రి తన కుటుంబాన్ని ఓ క్రైమ్ నుంచి కాపాడుకునేందుకు పడే తపన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలు అదే స్థాయిలో మ్యాజిక్ చేయడంతో, మేకర్స్ ఈ జానర్‌లో మరిన్ని మూవీస్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు థ్రిల్‌ను యాడ్ చేయటం బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయింది. రీసెంట్‌గా ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాకు కాస్త కామెడీ టచ్ ఇస్తూ ‘పరిమళ అండ్ కో’ లాంటి డిఫరెంట్ మూవీస్ వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ సాధారణ కుటుంబం, ఓ లోకల్ రౌడీ వల్ల ఊహించని క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన సినిమా పరిమళ అండ్ కో. దృశ్యం తరహా థ్రిల్‌కు, హ్యూమర్ జోడించి రూపొందించిన ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌తో పాటు డిజిటల్‌లోనూ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అర్జున్‌, అభిరామి, ప్రీత ముకుందన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బ్లాస్ట్ మూవీ కూడా ఫ్యామిలీ క్రైమ్‌ కథా చిత్రమే. అనుకోకుండా ఓ క్రైమ్‌లో ఇరుక్కున్న ఫ్యామిలీ, తమని తాము కాపాడుకునేందుకు ఓ విలన్‌ గ్యాంగ్‌ను ఎలా అంతం చేసిందనే పాయింట్‌ను ఈ సినిమాలో ఇంట్రస్టింగ్‌గా చూపించారు. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. లేటెస్ట్ టాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ మా ఇంటి బంగారం కూడా ఇదే జానర్‌ మూవీ. సమంత లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ యువతి చేసిన పోరాటమే మా ఇంటి బంగారం కథ. యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయిన ఈ స్టోరి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు ఈ జానర్‌లో మరిన్ని సినిమాలు చేసేందుకు ధైర్యాన్ని ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *