ఇప్పటివరకు మీరు ఎన్నో వంటకాలు చేసుకుని తింటారు కానీ, అన్నింటిలో ఇది మాత్రం సూపర్. తింటే 1000 ఏనుగుల బలం వస్తుంది. అప్పట్లో తాతలు ఇదే తినేవాళ్లు. మరి, అస్సలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి చూద్దాం..
పంచామృతానికి కావాల్సిన పదార్థాలు: అర కప్పు పాలు, అర కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ తేనె,
ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా బెల్లం, కొద్దిగా అరటిపండు ముక్కలు , 3 తులసి ఆకులను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా పండుగ రోజుల్లో తింటారు.
పంచామృతం తయారీ విధానం: ముందుగా మీరు ఒక గిన్నెలో మంచి పాలను తీసుకుని ఆ తర్వాత దానిలో అర కప్పు పెరుగు వేసి బాగా మంచిగా కలపాలి. ఆ తరవాత దీనిలో కొద్దిగా నెయ్యి, తేనె, పంచదార లేకపోతే బెల్లం కొద్దిగా వేసి మంచిగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఒకసారి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని తిప్పుతూ ఉండాలి.
పంచామృతం తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా కావాలంటే మీరు దీనిలో కట్ చేసి అరటిపండు ముక్కలు, నాలుగు తులసి ఆకులు కూడా కలపితే ఆరోగ్యానికి చాలా మంచిది మీ దగ్గర ఉన్న.అన్ని పదార్థాలు బాగా కలిపితే పంచామృతం రెడీ. మీరు కూడా మీ ఇంట్లో పక్కాగా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది రుచి అదిరిపోద్ది
షుగర్ ఉన్నవాళ్లు వైద్యున్ని సంప్రదించి తీసుకోవాలి. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




