Headlines

Chennai Love Story: ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాను మధ్యలోనే వదిలేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సినిమాను మధ్యలోనే వదిలేసిన స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?


క, కే ర్యాంప్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్ తెచ్చుకున్న చెన్నై లవ్ స్టోరీ శుక్రవారం (జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేకర్స్ చెప్పినట్లు కల్ట్ లవ్ స్టోరీ కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రేమకథా చిత్రమని టాక్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాగే కిరణ్ అబ్బవరం మరోసారి తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను కాకుండా మరో జంటను హీరో, హీరోయిన్‌లుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అప్పట్లో విడుదలైంది. అయితే కొన్ని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో వారి స్థానంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను హీరో, హీరోయిన్లను తీసుకున్నారు. ఇంతకీ ఆ జంట ఎవరు? వారు ఎందుకు తప్పుకున్నారు? అనే విషయాల గురించి తెలుసుకుందాం రండి.

చెన్నై లవ్ స్టోరీ సినిమాను ఎస్కేఎన్, సాయి రాజేష్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇదే కాంబినేషన్ లో గతంలో బేబీ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీకి ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓవరాల్ గా 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అంతేకాదు ఆనంద్ దేవరకొండ- వైష్ణవిలకు మంచి గుర్తింపు, క్రేజ్ తీసుకొచ్చింది.
దీంతో ఇదే జోడీతో మరో సినిమా చేయాలని ఎస్కేఎన్, సాయి రాజేష్ రెడీ అయ్యారు.

ఆనంద్- వైష్ణవిలతో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు ఎస్కేఎన్, సాయి రాజేష్. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆనంద్, వైష్ణవి చైతన్య ఇతర చిత్రాలకు కమిట్ అయ్యారు. దీంతో వారిద్దరూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు వారి స్థానంలోనే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియలను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి



చెన్నై లవ్ స్టోరీ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *