Headlines

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..?

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..?


ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో అవసరాల కోసం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు. అవసరం లేకపోయినా చాలామంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటి ద్వారా ట్రన్సాక్షన్లు చేస్తే భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేసేవారు క్రెడిట్ కార్డును తీసుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలవారీగా కొంత చెల్లిస్తే సరిపోతుంది. అయితే కొంతమంది క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత బిల్లు కట్టలేక చేతులెత్తేస్తూ ఉంటారు. దీంతో బ్యాంక్ రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి అడుగుతూ ఉంటారు.

బిల్లు కట్టకపోతే నష్టాలెన్నో..?

క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోవడం వల్ల ఆర్ధికంగా భారీ నష్టపోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీ, లేట్ ఫీజుల వల్ల మరింతగా అప్పుల పాలవుతారు. అలాగే మీ క్రెడిట్ స్కోరు భారీగా పడిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీ ఏ బ్యాంక్ కూడా లోన్ మంజూరు చేయదు. ఎక్కువకాలం పాటు కట్టకపోతే బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ మీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. మీ ఇంటికి వచ్చి అడగడంతో పాటు మీకు నోటీసులు జారీ చేస్తారు. పదే పదే వచ్చి అడగడం వల్ల మానసికంగా మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

పోలీసులు అరెస్ట్ చేయవచ్చా..?

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే పోలీసులు చట్టపరంగా మీపై కేసు నమోదు చేయవచ్చా..? మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చా? అంటే.. ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవ్. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించనందుకు పోలీసులు మిమ్మల్ని ఎప్పటికీ అరెస్టు చేయలేరు. అలా కట్టకపోవడం నేరం కాదు. ఇది రుణ ఎగవేత వర్గం కిందకు వస్తుంది కానీ నేరం కిందకు రాదు. అయితే బ్యాంక్ కోర్టులో పిటిషన్ వేసి ఖాతాదారుడి నుంచి రికవరీ చేసేలా చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే మీ ఆస్తిని కూడా జప్తు చేసే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ఉన్న బ్యాంకులోనే ఖాతా కూడా ఉన్నట్లయితే.. బ్యాంకు ఆ ఖాతాలోని డబ్బుతో బకాయి మొత్తాన్ని సర్దుబాటు చేయగలదు. మీ నుంచి డబ్బు రాబట్టడానికి అవసరమైతే బ్యాంకు కోర్టులో సివిల్ కేసు దాఖలు చేయవచ్చు. దీంతో మీరు కోర్టుల చుట్టూ తిరగాలా్సి ఉంటుంది. దీని వల్ల మీ సమయం, డబ్బు వృధా అవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *