Headlines

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి


అభిషేక ప్రియుడు పరమశివుడు అయితే.. అలంకార ప్రియుడు శ్రీనివాసుడు. అందుకు తగ్గట్టుగానే భక్తులు కూడా ఆయా దేవతలను వారికి నచ్చినరీతిలో పూజిస్తూ ఉంటారు. సాధారణంగా పరమశివునికి పాలతో, గంగతో అభిషేకం చేస్తారు. కొన్నిచోట్ల తైలాభిషేకం అని చెప్పి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అలా నూనెతో అభిషేకం చేస్తున్న క్రమంలో ఓ అద్భుత జరిగింది. అభిషేకం చేస్తున్న నూనె కాస్తా పాలుగా మారిపోయాయి. ఈ అద్భుత ఘటన చిత్తూరు జిల్లా లో జరిగింది. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చేరి తెగ వైరల్‌ అవుతోంది. ఐరాల మండలం చిన్న వెంకటాపల్లిలోని సుమారు 800 ఏళ్ల నాటి ప్రాచీన శ్రీ మృత్యుంజయ శివాలయం ఉంది. రోజూలాగే ఈరోజుకూడా ఈ ఆలయంలో అర్చకులు శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్నారు. అయితే విచిత్రంగా ఆ నూనె పాలుగా మారిపోవడంతో అర్చకులు ఆశ్చర్యపోయారు. అభిషేకాన్ని తిలకిస్తునన భక్తులు సైతం ఆశ్చర్యపోతూ హరహరమహాదేవ అంటూ ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. గత మే నెలలోనే ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టి గ్రామస్థులు అత్యంత ఘనంగా కుంబాభిషేకం నిర్వహించారు. అంతేకాకుండా, గత పది రోజులుగా ఆలయంలో విశేషంగా రుద్ర పఠనం కూడా సాగుతోంది. ఈ క్రమంలో ఆలయ అర్చకుడు రాజేష్ స్వామి శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుండగా, నూనె రంగు మారి తెల్లని పాలవలే కనిపించడం ప్రారంభమైంది. ఈ వింత ఘలన ఆ నోటా ఈ నోటా పాకి, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. దీంతో చిన్న వెంకటాపల్లి మృత్యుంజయ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. శివలింగంపై నూనె తెల్లగా మారడాన్ని ప్రత్యక్షంగా చూసి పరవశించిపోతున్నారు. ఇదంతా ఆ పరమశివుని లీలయేనంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!

Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

Boy Friend For Rent: గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!..సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *