Headlines

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక

Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ చిరు నుంచి దిమ్మతిరిగే బర్త్‌ డే కానుక


మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అండ్ పాపులారిటీ వేరే లెవల్‌. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను ఏలుతోన్న మెగాస్టార్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి కొత్త సినిమా రిలీజైనా ఆయన పుట్టిన రోజు వచ్చినా మెగాభిమానులందరూ పండగ చేసుకుంటారు. దాంతో పాటే చిరు పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతారు. అన్నదానం, రక్తదానం ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మెగాభిమానులమని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్లుగా తన పేరు మీద సేవలందిస్తున్న మెగా అభిమానుల కోసం చిరు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రానున్న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు రూ.5 లక్షల మేర ఇన్సూరెన్స్ చేయించబోతున్నారట. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన చిరు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ చరిత్రంలో ఏ హీరో ఇలా అభిమానులకు ఇన్సూరెన్స్ చేయించలేదని, మెగాస్టారే ఇలాంటి మంచి కార్య క్రమానికి శ్రీకారం చుట్టారని పలువురు అభినందిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 నుంచే ఈ గొప్ప కార్యక్రమం మొదలుపెడతారని తెలుస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Balakrishna: బాలయ్య హెల్త్ అప్‌డేట్.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

Bigg Boss Telugu: ‘ప్రతి 10 మందిలో.. 8 మంది బిగ్ బాస్‌ను చూస్తున్నారా..’ పిచ్చెక్కిస్తున్న రియల్ టైం డాటా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *