Headlines

Summer Tips: వేసవిలో పాలు త్వరగా విరిగిపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే రోజంతా తాజాగా ఉంటాయి!

Summer Tips: వేసవిలో పాలు త్వరగా విరిగిపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే రోజంతా తాజాగా ఉంటాయి!


Summer Tips: వేసవిలో పాలు త్వరగా విరిగిపోతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే రోజంతా తాజాగా ఉంటాయి!

Milk Storage Tips: ఎండలు ముదురుతున్న కొద్దీ వంటింట్లో గృహిణులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య పాలు విరిగిపోవడం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాలలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, పాలు త్వరగా పాడవుతాయి. ముఖ్యంగా పవర్ కట్ ఉన్నప్పుడు లేదా ఫ్రిజ్ సౌకర్యం లేనప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్‌ ఫెయిల్.. 2 లక్షల ఉద్యోగానికి రాజీనామా.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!

1. పాలను మరిగించే విధానం

పాలను ఎప్పుడూ తక్కువ మంట మీద నెమ్మదిగా మరిగించాలి. అధిక మంట మీద వేడి చేస్తే పాల రుచి మారవచ్చు. వేసవిలో పాలను రోజుకు 3 నుండి 4 సార్లు తక్కువ వేడిపై మరిగిస్తే, అవి ఎక్కువ సేపు పాడవకుండా ఉంటాయి.

2. మూత పెట్టేటప్పుడు జాగ్రత్త

పాలు మరిగించిన వెంటనే గట్టిగా మూత పెట్టకూడదు. ఆవిరి బయటకు వెళ్లేలా మూతను కొంచెం పక్కకు జరిపి ఉంచాలి. దీనివల్ల పాలు త్వరగా చల్లారతాయి. అలాగే విరిగిపోయే అవకాశం తగ్గుతుంది.

3. శుభ్రమైన పాత్రల వాడకం

పాలను నిల్వ చేసే పాత్రలు ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉండాలి. పాత్రలు సరిగ్గా కడగకపోయినా లేదా తడిగా ఉన్నా బ్యాక్టీరియా చేరి పాలు త్వరగా విరిగిపోతాయి.

4. మట్టి పాత్రల వాడకం

మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే, పాలను మట్టి పాత్రలో పోసి ఉంచడం మంచిది. ఆ పాత్రపై తడి గుడ్డను కప్పితే పాలు చల్లగా ఉంటాయి. త్వరగా పాడవు.

5. గాజు పాత్రలో నిల్వ

ప్లాస్టిక్ పాత్రల కంటే గాజు సీసాలు లేదా జార్లలో పాలను నిల్వ చేయడం ఉత్తమం. గాజు వేడిని తక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల పాలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.

6. బేకింగ్ సోడా ట్రిక్

పాలు మరిగించేటప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తే అవి విరిగిపోకుండా ఉంటాయి. అయితే సోడా చాలా తక్కువ మొత్తంలో వాడాలి. లేదంటే పాల రుచి మారిపోయే ప్రమాదం ఉంది.

7. ఫ్రిజ్ లేనప్పుడు ఇలా చేయండి

ఒకవేళ ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే, పాలు ఉన్న గిన్నెను చల్లటి నీరు ఉన్న ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో ఉంచండి. ఆ పాత్రను ఫ్యాన్ కింద ఉంచడం వల్ల పాలు కొన్ని గంటల పాటు సురక్షితంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *