Headlines

GT vs SRH: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. వరుసగా మూడో ఏడాది కూడా తోపురా భయ్..!

GT vs SRH: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. వరుసగా మూడో ఏడాది కూడా తోపురా భయ్..!


Sai Sudharsan IPL 2026 stats: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుత సీజన్‌లో 500 పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా 2024, 2025, 2026 సీజన్లలో వరుసగా 500 కంటే ఎక్కువ పరుగులు సాధించి, గతంలో కోహ్లీ (2023-2025) నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలా వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది ఆటగాళ్లలో సుదర్శన్ ఒకరిగా నిలిచాడు.

ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానం..

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో సాయి సుదర్శన్ ప్రస్తుత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుని ‘ఆరెంజ్ క్యాప్’ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 41.75 సగటుతో 501 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, ఐదు అర్ధశతకాలు ఉండటం విశేషం. గత ఏడాది కూడా 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న సుదర్శన్, ఇప్పుడు రెండోసారి ఆ ఘనత సాధించే దిశగా దూసుకుపోతున్నాడు.

వరుసగా 500+ పరుగులు చేసిన దిగ్గజాలు..

ఐపీఎల్ చరిత్రలో వరుస సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది:

డేవిడ్ వార్నర్: 6 సీజన్లు

కేఎల్ రాహుల్: 5 సీజన్లు

క్రిస్ గేల్: 3 సీజన్లు

శిఖర్ ధావన్: 3 సీజన్లు

విరాట్ కోహ్లీ: 3 సీజన్లు

సాయి సుదర్శన్: 3 సీజన్లు

గుజరాత్ పోరాటం: వాషింగ్టన్ సుందర్ మెరుపులు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సుదర్శన్ 61 పరుగులతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, చివరిలో వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులతో మెరుపులు మెరిపించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజ్ రెండు వికెట్లతో రాణించగా, పాట్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *