Headlines

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !


ఏనుగుల శబ్దం వింటే ఎవరైనా భయంతో వణుకుతారు. కానీ తమిళనాడు బామ్మ కుట్టియమ్మాళ్‌ ఏనుగుల శబ్దం వినకుండా ఉండలేనని తనకు నిద్ర పట్టదని చెప్పి ఆశ్చర్యపరిచారు. చుట్టుపక్కన ఎవ్వరూ లేకపోయినా.. ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్ల మధ్య అడవిలో ఒంటరిగా ఉంటున్నారు. ఏనుగులతోనే తన జీవితం ముడిపడి ఉందనీ ఆ అడవి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. తిరునెల్వేలి జిల్లాలోని పశ్చిమ కనుమలు చాలా అందంగా ఉంటాయి. బ్రిటిషర్ల కాలం నుంచే ఇంజికుజి గ్రామంలో ఉంటోన్న గిరిజన మహిళ కుట్టియమ్మాళ్‌.. టార్పాలిన్ కప్పిన మట్టి ఇంట్లో నివసిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇంజికుంజి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ విష్ణు ఆమెకు పెన్షన్ మంజూరు చేసారు. కానీ 21 కిలోమీటర్లు అడవిలోకి వెళ్లి ఆమెకు పెన్షన్‌ ఎవరు ఇస్తారన్నది పెద్ద ప్రశ్న గా మారింది. అయితే కరైయర్ పోస్ట్‌ మ్యాన్ ఆ బాధ్యత తన భుజాన వేసుకున్నారు. ఆమెతో కలిసి జీవించిన కూతురు పాము కాటు వల్ల మరణించడంతో ప్రస్తుతం వృద్ధురాలు ఒంటరిగానే కాలం వెళ్లదీస్తున్నారు. అడవిలో జీవించడం వల్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, కట్టెలు అందుబాటులో ఉన్నాయని, నదిలో నీరు ప్రవహిస్తుందని కుట్టియమ్మాళ్‌ చెబుతారు. తాను ఇంజికుజి పర్వత ప్రాంతంలోనే పుట్టి పెరిగానని, అక్కడ నుంచి వెళ్లదలచుకోవట్లేదని స్పష్టం చేసారు. మేఘాలను చూసే టైమ్ తెలుసుకుంటానని ప్రస్తుత ప్రభుత్వం కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనెను అందించాలని ఆమె కోరారు. కరైయర్ రేషన్ షాప్‌ నుంచి కొందరు వృద్ధురాలి కోసం రేషన్ బియ్యం కొంటుంటారు. ప్రస్తుతం ఇంజికుజి గ్రామంలో మూడు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వారంతా కుట్టియమ్మాళ్‌ ఉంటున్న పర్వత ప్రాంతం నుంచి తమ అవసరాల కోసం కిందికి తరలివెళ్లారు. ఏనుగులు ఆమె ఇంటికి సమీపంగా వచ్చి శబ్దం చేసి ఆ వెంటనే వెళ్లిపోతాయట. అదే అడవిలో పుట్టాను కాబట్టి ఏనుగును కానీ మరే ఇతర జంతువును చూసినా భయపడనని ఆమె అంటుంటారు. తను పర్వత ప్రాంతాన్ని వదిలి కిందకి వెళ్లనని ఏనుగు తన దగ్గరకు రాదనీ అది చాలా దూరంలో ఉంటుందనీ చెబుతారు. తనకు మనుషుల శబ్దం నచ్చదనీ గజరాజు అరుపుల శబ్దం వినకుండా తను జీవించలేననీ అన్నారు. ఏనుగును ఎవరైనా చంపితే అది వారిని చంపుతుందని కుట్టియమ్మాళ్‌ జీవితసత్యాన్ని వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు

పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి

భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *