ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్


ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ గెలుపును చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఫలితంగా అభివర్ణించారు. “నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడు భారతదేశానికి ఉండటం ఆ దేశ ప్రజల అదృష్టం” అని ఆయన కొనియాడారు. మోదీ మూడవసారి పదవీకాలంలో ఉన్న తరుణంలో, ఈ విజయం ఆయన రాజకీయ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత పటిష్టం చేసిందన్నారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ వెల్లడించారు.

బీజేపీ ఈ విజయాన్ని కేవలం ఒక ఎన్నికల గెలుపుగా కాకుండా, దీర్ఘకాలిక వ్యూహాల పరాకాష్టగా విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన కొన్ని ఎన్నికలుగా స్థిరంగా 40% ఓట్లను సాధిస్తూ వచ్చిన బీజేపీ, ఈసారి సంస్థాగత బలహీనతలను అధిగమించి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి దూసుకెళ్లింది. ముఖ్యంగా సుపరిపాలన నినాదంతో టీఎంసీపై ఉన్న అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కొత్త హామీలతో మహిళలు, గ్రామీణ ఓటర్ల మద్దతు పొందింది. సంప్రదాయ ఓటు బ్యాంకులను చీల్చి, అన్ని వర్గాల మద్దతును కూడగట్టడంలో భారతీయ జనతా పార్టీ విజయవంతమైంది.

విజయం అనంతరం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “బెంగాల్ తలరాతలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది ప్రజాశక్తికి, బీజేపీ సుపరిపాలన రాజకీయాలకు దక్కిన గౌరవం” అని ప్రకటించారు. పది కోట్లకు పైగా జనాభా ఉన్న బెంగాల్‌లో విజయం సాధించడం ద్వారా, తూర్పు భారతదేశంలో పార్టీ విస్తరణను బీజేపీ పూర్తి చేసింది. మరోవైపు, తన స్థానాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. ఏదేమైనా, ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా, ఆ తర్వాత టీఎంసీ అడ్డాగా ఉన్న బెంగాల్ ఇప్పుడు కషాయమయం కావడం భారత రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *