బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? అవసరం లేదు! ఈ పద్ధతులు పాటిస్తే సన్నగా, నాజుగ్గా ఉండొచ్చు..!!

బరువు తగ్గాలంటే అన్నం మానేయాలా? అవసరం లేదు! ఈ పద్ధతులు పాటిస్తే సన్నగా, నాజుగ్గా ఉండొచ్చు..!!


మన దేశంలో అన్నం ప్రధాన ఆహారం. అయితే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వారు మొదట చేసే పని అన్నం తినడం ఆపేయడం. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనేది నిజమే అయినప్పటికీ, దానిని తినే విధానం తెలిస్తే మాత్రం బరువు పెరగకుండానే అన్నం తినవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అన్నం తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు తప్పక గుర్తుంచుకోండి.. అవేంటంటే…

గంజి వార్చడం: ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండటం వల్ల అందులోని స్టార్చ్ (Starch) అలాగే ఉంటుంది. దీనికి బదులుగా గిన్నెలో వండి, ఉడికిన తర్వాత గంజి వార్చడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల శాతం గణనీయంగా తగ్గుతుంది.

పోర్షన్ కంట్రోల్ (పరిమిత మోతాదు): మీరు తీసుకునే ప్లేట్‌లో అన్నం తక్కువగా ఉండాలి. ఒక చిన్న కప్పు అన్నం తీసుకుని, మిగిలిన ప్లేట్‌ను కూరగాయలు, పప్పు లేదా పెరుగుతో నింపాలి. దీనివల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. అతిగా తినడం తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కూరగాయలతో కలపండి: అన్నం వండేటప్పుడు అందులో బీన్స్, క్యారెట్, బఠానీలు వంటి కూరగాయలు చేర్చి వెజిటబుల్ రైస్ లాగా చేసుకోవడం వల్ల మీకు ఫైబర్ (పీచు పదార్థం) అందుతుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

సరైన సమయం: అన్నం తినడానికి మధ్యాహ్నం సమయం ఉత్తమమైనది. పగటిపూట మన జీవక్రియ (Metabolism) వేగంగా ఉంటుంది. కాబట్టి, అన్నం సులభంగా జీర్ణమవుతుంది. ఒకవేళ రాత్రిపూట అన్నం తినాలనుకుంటే, నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందే తినాలి.

బ్రౌన్ రైస్ ఎంచుకోండి: వీలైతే తెల్ల అన్నం కంటే బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యం తినడం మేలు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

ఆహారాన్ని నియంత్రించడం అంటే ఇష్టమైన వాటిని పూర్తిగా వదిలేయడం కాదు, వాటిని తెలివిగా తీసుకోవడం. అన్నం వండే విధానంలో, తినే మోతాదులో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్య లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *