తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఇప్పటికే 45కు పైగా స్థానాల్లో విజయం సాధించిన టీవీకే మరో 50కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తానికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ‘విజయ్’ ఢంకా మెగించారీ హీరో. ఈ నేపథ్యంలో దళపతి సినిమా లకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. రాజకీయాలకు విజయ్ కొత్త కావొచ్చు కానీ సినిమాల విషయానికి వస్తే ఆయనొక సూపర్ స్టార్. తమిళనాట రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఆయన. అంతేకాదు మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో కూడా ఒకరు. అందుకు తగ్గట్టుగానే విజయ్ సినిమా కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. కాగా విజయ్ దళపతితో ఎందరో స్టార్ హీరోయిన్స్ రొమాన్స్ చేశారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రమే హీరో విజయ్ కు తల్లిగా, లవర్ గా, భార్యగా నటించింది. ఆమె ఎవరో కాదు తెలుగింటి బాపు బొమ్మ స్నేహ.
విజయ్, స్నేహ కాంబినేషన్లో ‘వశీగర’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (ది గోట్) అనే రెండు సినిమాలొచ్చాయి. ‘వశీగర’ సినిమా విషయానికి వస్తే.. తెలుగు కల్ట్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఇందులో ప్రేమికులుగా విజయ్, స్నేహల జోడీకి మంచి పేరొచ్చింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్న కాంప్లిమెంట్స్ వినిపించాయి.
కట్ చేస్తే ఈ సినిమా వచ్చిన 21 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్, స్నేహాలు కలిసి నటించారు. విక్రమ్ ప్రభు తెరకెక్కించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2024లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇందులో విజయ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపిస్తారు. అలా విజయ్ కు తల్లిగానూ, భార్యగానూ స్నేహ నటించింది. అలాగే మరో హీరోయిన్ నిత్యా మేనన్ కూడా విజయ్‌కు తల్లిగా, భార్యగా నటించింది. ఇందులో విజయ్ తండ్రిగా, ఇద్దరు కొడుకులగా ఏకంగా త్రిపుల్ రోల్ లో నటించడం విశేషం. ఇందులో తండ్రికి భార్యగా నిత్యామీనన్ నటించింది. మొత్తానికి స్నేహ, నిత్యా మేనన్ మాత్రమే విజయ్ కు తల్లిగా, భార్యగా నటించారు.
.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.