PM Modi: NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ

PM Modi: NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎక్స్‌ వేధికగా ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు కేంద్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలోనూ తాము ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటామని ప్రధాని మోదీ రాసుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ప్రజల గొంతుకగా నిలబడతామని హామీ ఇచ్చారు.

అలాగే తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యమైన ప్రదర్శన కనబరిచిందని ఆయన అన్నారు. తొలి ఎన్నికల్లోనే ఇంతటి ప్రభావాన్ని చూపినందుకు ఆ పార్టీ అధినేత విజయ్, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మిళనాడు పురోగతిని, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ పోస్ట్ చూడండి..

మరోవైపు బెంగాల్‌లో బీజేపీ విజయంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. బెంగాల్‌లో కమలం వికసించిందని.. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు. ఇది బెంగాల్‌ ప్రజల సాధించిన విజయమని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో బీజేపీని గెలిపించిన ప్రతి ఓటర్‌కు, పార్టీ గెలుపుకోసం కష్టపడిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. అలానే అస్సాం, కేరళ, పుద్దుచ్చేరిలో ఎన్టీఏకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి ప్రధాని మోదీ ధన్యావాదాలు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *