మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన

మే నెలలో ముంచెత్తనున్న వానలు.. వాతావరణ శాఖ సంచలన ప్రకటన


భారత వాతావరణ శాఖ ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది, మే 2026లో దేశవ్యాప్తంగా వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా వేసింది. సాధారణంగా ఈ నెలలో భానుడి భగభగలు, వడగాలులు ఎక్కువగా ఉంటాయి. అయితే, రాబోయే మే నెలలో ఎండల తీవ్రత కంటే వర్షాల ప్రభావమే ఎక్కువగా ఉండబోతోందని ఐఎండీ స్పష్టం చేసింది. 1971 నుండి 2020 మధ్య సగటు వర్షపాతం 64.1 మిల్లీమీటర్లు కాగా, ఈసారి అది గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలకు బదులుగా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. వాయువ్య, మధ్య భారతం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉండవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 3 నుండి 6 మధ్య పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

మరిన్ని వీడియోల కోసం :

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!

టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *