భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ ఆధ్వర్యంలోని ప్రసార్ భారతి దూరదర్శన్ కేంద్ర.. హైదరాబాద్ బ్రాంచ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద వీడియో అసిస్టెంట్, రిసోర్స్ పర్సన్, పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్ ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా (టీవీ ప్రొడక్షన్‌లో డిప్లొమా లేదా మాస్ కమ్యునికేషన్ లేదా జర్నలిజం లేదా వీడియో ఎడిటింగ్ లేదా వీడియోగ్రఫీ)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు publicrelationsddyadagiri@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చు. లేదంటే ఈ కింది అడ్రస్‌లో నేరుగా అందివచ్చు లేదా పోస్టు ద్వారా కూడా పంపించవచ్చు. దరఖాస్తులను తప్పనిసరిగా మే 29, 2026వ తేదీలోపు అందించవల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
దరఖాస్తు చేసుకున్న వారికి స్కిల్ టెస్ట్/ రాత పరీక్ష/ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఒక్కో అసైన్‌మెంట్‌కు రూ.3000 నుంచి రూ. 5000 వరకు చెల్లిస్తారు. ఏడాదికి మొత్తం 84 అసైన్‌మెంట్లు ఉంటాయి. వారానికి 7 చొప్పున అసైన్‌మెంట్లు ఉంటాయి. అప్లికేషన్‌ను ఈ కింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
దరఖాస్తులు పంపించవల్సిన అడ్రస్ ఇదే..
Head of Programmes,
Doordarshan Kendra,
Ramanthapur,
Hyderabad- 500013.
హైదరాబాద్ ప్రసార్ భారతిలో ఉద్యోగాలకు దరఖాస్తు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.