తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అనూహ్య ఫలితాలను సాధించి, అధికార పీఠానికి చేరువలో ఉంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, TVK పార్టీ దాదాపు 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక సాయంత్రం లెక్కింపు పూర్తయ్యే లోపు 110 వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీవీకే పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 118 సాధించాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రకారం చూసుకుంటే విజయ్ పార్టీ ఒంటిరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీవీకే అభ్యర్థులు పోటీ చేస్తున్న చాలా స్థానాల్లో కేవలం స్వల్ప ఆధిక్యం మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి ఈ నెంబర్ ఎప్పుడైనా తారుమారు కావచ్చు.
స్వల్ప మెజార్టీల్లో టీవీకే అభ్యర్థులు
టీవీకే పార్టీ మెజార్టీలో కొనసాగుతున్న స్థానాలు ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో దాదాపు 11 స్థానాల్లో కేవలం 3 వేల లోపు మెజార్టీతోనే టీవీకే అభ్యర్థులు కొనసాగుతున్నారు. మరో 12 చోట్లు కేవలం 2 వేల లోపు మెజార్టీతో టీవీ అభ్యర్థులు ఉన్నారు. ఇక మరో 8 స్థానాల్లో చూసుకుంటే టీవీకే అభ్యర్థులు కేవలం 500 లోపు మెజార్టీతో కొనసాగుతున్నారు.
హంగ్ వస్తే పరిస్థితి ఏంటి?
అయితే ప్రస్తత సమీకరణాలు చూసుకుంటే తమిళనాడు హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ హంగ్ వస్తే టీవీకే పార్టీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీకేకు మ్యాజిక్ ఫిగర్ తగ్గితే మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక వేళ టీవీకేకు కేవలం 5 నుండి 10 సీట్లు మాత్రమే తక్కువైతే కాంగ్రెస్ పొత్తు వద్దనుకుంటే స్థానికంగా ఉన్న పీఎంకే వంటి చిన్న పార్టీలు లేదా గెలిచిన స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.