“లైఫ్ సెటిల్ అయింది అని ఎప్పుడు అనుకుంటాం?” అని ఎవరినైనా అడగండి.. ఈ ప్రశ్నకు పదిలో తొమ్మిది మంది చెప్పే సమాధానం “సొంత ఇల్లు కొన్నప్పుడు” అని. నిజమే, మన సమాజంలో సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల విషయం కాదు, అది ఒక గౌరవం, ఒక భద్రత. కానీ, ఆవేశపడి అప్పులు చేసి ఇల్లు కొన్నాక, ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక సతమతమయ్యే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే బిజినెస్ నిపుణులు ఈ అంశంపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
మీ జీతంలో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఉండకూడదు. వినడానికి ఇది సింపుల్‌గా అనిపించినా, ప్రాక్టికల్‌గా చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా అని మన సామర్థ్యానికి మించి ఇల్లు కొంటే, నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఇక కెరీర్ విషయానికి వస్తే, ఐటీ లాంటి ప్రైవేటు ఉద్యోగాల్లో ఉండేవారు కాస్త ఆలోచించాలి. ఇవాళ హైదరాబాద్‌లో ఉన్న ఉద్యోగం రేపు బెంగళూరుకు మారవచ్చు. అలాంటప్పుడు కొన్న ఇల్లు వదిలేసి, మరో చోట అద్దెకు ఉండటం డబుల్ ఖర్చు అవుతుంది.
అయితే, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇల్లు కొనడం వల్ల వచ్చే లాభం తక్కువ కాదు. చిన్న వయసులోనే ఇల్లు కొని ఆ భారాన్ని మోయడం కంటే, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, 35-40 ఏళ్ల వయసు వచ్చేసరికి మీ దగ్గర మంచి కార్పస్ ఉంటుంది. అప్పుడు లోన్ భారం లేకుండా ఇల్లు కొనుక్కోవచ్చు. సొంత ఇల్లు అనేది ఎమోషన్ మాత్రమే కాదు, అదొక పక్కా లెక్కలతో కూడిన ఆర్థిక నిర్ణయం కావాలి. అప్పుడే ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలం.
Also Read Related Articles:
EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? మీరు ఫైనాన్సియల్ సూసైడ్ చేసుకున్నట్టే..