బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త


డబ్బులతో బెట్టింగ్ ఆడే ఆన్‌లైన్ గేమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1, 2026 నుంచి కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. దీంతో గేమింగ్ ఇండస్ట్రీలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. అయితే, ఈ కొత్త రూల్స్ వెనుక ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏం మారబోతోంది? కొత్తగా అమల్లోకి వచ్చిన ఆ రూల్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పెరుగుతున్న మోసాలకు, ఆర్థిక నష్టాలకు అడ్డుకట్ట వేయడానికి ‘ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్ 2026’ అమల్లోకి వచ్చాయి. దీనికోసం ప్రత్యేకంగా ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అనే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం గేమ్‌లను ఆన్‌లైన్ మనీ గేమ్స్, సోషల్ గేమ్స్, ఇ-స్పోర్ట్స్‌గా వర్గీకరించారు. యూజర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని వయస్సు పరిమితులు, తల్లిదండ్రుల నియంత్రణ , గేమ్స్ ఆడే సమయంపై ఆంక్షలు విధించడం ఇకపై గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు తప్పనిసరి. ముఖ్యంగా విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ భారతీయ వినియోగదారులను ఆకర్షించే గేమింగ్ కంపెనీలకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. సదరు కంపెనీ కార్యాలయం ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ, భారత్‌లో సేవలు అందిస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీనివల్ల విదేశీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరిగే అక్రమ లావాదేవీలకు, డేటా చోరీకి అడ్డుకట్ట పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదేవిధంగా నైపుణ్యం కాకుండా కేవలం అదృష్టంపై ఆధారపడి డబ్బులు పందెం కాసే గేమ్స్‌పై పూర్తిగా నిషేధం విధించబడింది. గత ఏడాది ఆమోదించిన చట్టాన్ని అమలు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిర్ణయం వల్ల రియల్ మనీ గేమింగ్ సెక్టార్‌పై భారీ ప్రభావం పడనుంది. అలాగే విదేశీ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన ప్రకటనలు, ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేసే ప్లాట్‌ఫారమ్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం గుర్తించిన స్వీయ నియంత్రణ సంస్థల (SRO) ద్వారా ధృవీకరించని గేమింగ్ యాప్స్ భారత్‌లో పనిచేయడానికి ఇకపై వీలుండదు. ఇకపై ప్రతి గేమింగ్‌ యాప్ తప్పనిసరిగా వెరిఫికేషన్ పొందాలి. ప్రతి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ తమ యాప్‌లో ప్రభుత్వ ఆమోదం పొందిన “Verification Mark” తప్పనిసరిగా చూపించాలి. దీని ద్వారా యూజర్లు నమ్మకంగా గేమ్ ఆడగలరు. డబ్బుతో ఆడే గేమ్స్‌లో కేవైసీ తప్పనిసరి చేశారు. ఇది మైనర్లు ఇబ్బడిముబ్బడిగా డబ్బులు ఖర్చు చేయకుండా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. అలాగే డబ్బులతో సంబంధం లేని సాధారణ గేమ్‌లకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ-స్పోర్ట్స్ కేటగిరీలోకి వచ్చే ఆటలకు మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఐటీ శాఖ సెక్రెటరీ అధికారికంగా వెల్లడించారు. పారదర్శకత పెంచడమే ఈ కొత్త నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. నియమాలను పాటించని యాప్స్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త రూల్స్ ప్రధాన ఉద్దేశ్యం యూజర్ల భద్రతను పెంచడం. గేమింగ్ వ్యసనాలు, ఆర్థిక నష్టాలు తగ్గించడం కోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అలాగే ఈ కొత్త గేమింగ్‌ రూల్స్‌తో వినియోగదారుల డేటా, ట్రాన్సాక్షన్లు కూడా మరింత సురక్షితంగా ఉంటాయి. ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలుచుకున్న ప్రతి రూపాయిపై నిబంధనల ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. ఇకపై స్కిల్ ఆధారిత గేమ్స్.. అంటే ఆటగాడి ప్రతిభ, వ్యూహం అవసరమయ్యే గేమ్స్ మాత్రమే కొనసాగనున్నాయి. మొత్తానికి, ఇండియాలో వేగంగా విస్తరిస్తోన్న ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ఇది ఒక పెద్ద మార్పు అని చెప్పాలి. డబ్బుతో ఆడే గేమ్స్‌కు కఠిన నియంత్రణ, స్కిల్ గేమ్స్‌కు ప్రోత్సాహం, పారదర్శకమైన గేమింగ్ వాతావరణాన్ని సృష్టించడం ఈ రూల్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అయితే, ఈ కొత్త రూల్స్ గేమింగ్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేస్తాయా? లేదా అనేది చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..

విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??

వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *