తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..


అమెరికా వెళ్తే బతుకు మారుతుందనుకున్నాడు. కష్టపడి చదివినప్పటికీ ఉద్యోగం రాలేదు. కొన్ని వారాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి, తను బతకడానికి కూడా సెక్యూరిటీ గార్డుగా చాలీ చాలని జీతంతో కష్టపడుతున్న తండ్రి నుంచి డబ్బులు తెప్పించుకోవడం ఏమాత్రం తట్టుకోలేకపోయిన అతడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికాగోలో ఉన్నత చదువులు చదివిన ఆ మేధావి.. చివరికి మృతదేహంగా ఇంటికి వస్తున్నాడని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 26 ఏళ్ల ఇరగనబోయిన చందు మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. చందు చికాగోలోని డిపాల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తన తండ్రి కష్టాలను తీర్చాలని ఎన్నో కలలతో అమెరికా గడ్డపై అడుగు పెట్టాడు. అయితే చదువు పూర్తయిన తర్వాత గత కొన్ని వారాలుగా చందు ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ వరుస ప్రయత్నాలు విఫలం కావడం, ఆర్థికంగా కుటుంబంపై ఆధార పడాల్సి రావడంతో చందు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తండ్రి పడుతున్న శ్రమ, కుటుంబంపై ఉన్న అప్పుల భారం చందును మరింత కుంగదీశాయి. చివరకు నిరుద్యోగ బాధను తట్టుకోలేక తన గదిలోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం ఆ నిరుపేద కుటుంబానికి భారంగా మారింది. మృతదేహం తరలింపు, ఇతర చట్టపరమైన అనుమతులకు దాదాపు 25 వేల డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 23 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ప్రవాస భారతీయులు మానవత్వం చాటుకున్నారు. చందు మృతదేహ తరలింపుతో పాటు ఆయన తండ్రి చేసిన అప్పులను తీర్చేందుకు.. విరాళాల సేకరణ ప్రారంభించారు. 1,20,000 డాలర్ల లక్ష్యంతో చేపట్టిన ఈ సేకరణకు భారీ స్పందన లభిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే 76,000 డాలర్లకు పైగా విరాళాలు అందాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Singer Mangli: వాడి ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి అనుభవిస్తున్నా..

విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది

గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??

వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *