ACs Explode: ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో.. అదెప్పుడైనా పేలిపోవచ్చు!

ACs Explode: ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో.. అదెప్పుడైనా పేలిపోవచ్చు!


సమ్మర్‌ మండే ఎండల నుంచి మనకు ఉపశమనం కలిగించే ఉత్తమ ఎలక్ట్రానికి పరికరం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే. కానీ నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, ఈ ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడా సమస్యలు లేకపోలేవు. వీటిని సరిగ్గా వాడితే ఎంత ఉపయోగకరంగా ఉంటాయో.. వాడే విషయంలో తప్పులు చేస్తే అంతకు మించిన ప్రమాదాన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును వేసవికాలం వీటిని వాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. అవి బాంబుల్లా పేలే అవకాశం ఉంది. కాబట్టి ఇవి పేలడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం.

అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి?

రిఫ్రిజెరెంట్ లీకేజీలు: సాధారణంగా ఏసీలలో వాడే R-134a లేదా R-410A వంటి గ్యాస్‌లు సురక్షితమైనవి. కానీ, ఖర్చు తగ్గించుకోవడానికి వాడే నాసిరకం లేదా నకిలీ హైడ్రోకార్బన్ గ్యాస్‌లు త్వరగా మంటలను అంటుకుంటాయి. వైరింగ్ లేదా కంప్రెసర్ వద్ద చిన్న నిప్పురవ్వ వచ్చినా, లీకైన గ్యాస్ వల్ల పేలుడు సంభవించవచ్చు.

సరైన నిర్వహణ లేకపోవడం: చాలా మంది సంవత్సరాల పాటు ఏసీలను రిపేర్ చేయకుండా అలానే వాడుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా ఫిల్టర్లు లేదా కాయిల్స్‌లో దుమ్ము పేరుకుపోయి గాలి ప్రసరణ ఆగిపోంది. అప్పుడు కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ వేడి వల్ల కంప్రెసర్ లోపలి భాగాలు పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడూ ఏసీని శుభ్రంగా ఉంచుకోండి

విద్యుత్ లోపాలు: షార్ట్ సర్క్యూట్లు, నాసిరకం వైరింగ్ లేదా ఓవర్‌లోడ్ వల్ల ఏసీ లోపల మంటలు చెలరేగుతాయి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఏసీ వాడటం వల్ల మోటార్లు లేదా కెపాసిటర్లు వేడెక్కి పేలిపోవచ్చు. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న ఏసీలను చూసి కొనుక్కోవడం ముఖ్యం.

తప్పుడు ఇన్‌స్టాలేషన్: ఏసీని అమర్చేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోతే ప్రెజర్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల సేఫ్టీ వాల్వ్స్ ఫెయిల్ అయ్యి పేలుళ్లు జరిగే అవకాశం ఉంది.

ఏసీ పేలుళ్లను నివారించడం ఎలా?

  • మీ ఏసీ సురక్షితంగా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి
  • ఏసీ రిపేర్ చేసే ముందు పవర్‌ను స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా, యూనిట్‌ను పూర్తిగా డిశ్చార్జ్ చేయాలి.
  • లీక్ టెస్టింగ్ చేసిన తర్వాత లోపల ఉన్న నైట్రోజన్‌ను పూర్తిగా తొలగించాలి.
  • గాలి, తేమను తొలగించడానికి సరైన వ్యాక్యూమింగ్ పద్ధతులను అనుసరించాలి.
  • రిఫ్రిజెరెంట్ లెవల్స్ చెక్ చేయడం, కాయిల్స్, ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, వైరింగ్‌ను తనిఖీ చేయడం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.
  • ఏసీ ఇన్‌స్టాలేషన్ లేదా రిపేర్ కోసం ఎప్పుడూ సర్టిఫైడ్ మెకానిక్‌లను మాత్రమే సంప్రదించండి. సొంతంగా ప్రయోగాలు చేయకండి.
  • వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఏసీ పాడవకుండా ఉండటానికి నాణ్యమైన స్టెబిలైజర్‌ను ఉపయోగించండి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *