వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే

వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే


భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్‌ నెలనుంచే నిప్పులు కురిపిస్తున్న భానుడు మే నెలలో తన ప్రతాపం మరింత పెంచాడు. రాజమండ్రిలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి ఎండలో వేచి ఉండే వాహనదారుల కష్టాలను చూసి రాజమండ్రి పోలీసులు చలించిపోయారు. వారి కోసం ఒక అద్భుతమైన ఆలోచనతో తమ ఉదారత చాటుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేశారు. రోడ్లపై చలువ పందిళ్లను తలపించేలా కర్రలతో పందిళ్లు వేసి, వాటిపై గ్రీన్ మ్యాట్లను కట్టారు. దీనివల్ల సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఎండలో కాకుండా చల్లని నీడలో వేచి ఉండే అవకాశం కల్పించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన ఈ ఏర్పాట్లు చేశారు. ప్రతి ప్రధాన జంక్షన్‌లోనూ ఈ చలువ పందిళ్లను అందుబాటులోకి తెచ్చారు. పోలీసుల మానవత్వానికి, సమయస్ఫూర్తికి వాహనదారులు ఫిదా అవుతున్నారు. ఎండ తీవ్రతకు ఎక్కడ వడదెబ్బకు గురవుతామో అని భయపడుతున్న వేళ ఈ నీడ తమకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చల్లని నిర్ణయంపై మరిన్ని వివరాలు మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం

సిలిండర్ ‘డెలివరీ’ మాయాజాలం.. లక్షల్లో వసూళ్లు

రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు

గోళీలే ఆయుధాలు.. షాపింగ్‌ మాల్సే వారి టార్గెట్‌

కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *