ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్టులు కనిపించవు.. ఆ బ్యాచ్‌కు బ్యాడ్ న్యూస్!

ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్టులు కనిపించవు.. ఆ బ్యాచ్‌కు బ్యాడ్ న్యూస్!


చాలా కాలంగా, ఇన్‌స్టాగ్రామ్‌లోని వినియోగదారులు తమకు నచ్చిన కంటెంట్ తమ ఫీడ్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కంపెనీ మార్పులు చేసింది. దీని ప్రకారం, ఇతర క్రియేటర్ల కంటెంట్‌ను రీపోస్ట్ చేసే ఖాతాల రీచ్ ఇకపై తగ్గిపోనుంది. అటువంటి పోస్ట్‌లు ఫీడ్‌లో గానీ, ఎక్స్‌ప్లోర్ విభాగంలో గానీ సిఫార్సు చేయడం కుదరదు. ఈ విధంగా, వాటి రీచ్ దానంతట అదే తగ్గిపోతుంది. ఇలాంటి నియమాలు ఇప్పటికే రీల్స్‌కు వర్తిస్తున్నాయని, ఇప్పుడు ఈ నియమం ఫోటోలు, క్యారౌసెల్ పోస్ట్‌లకు కూడా వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఇతర క్రియేటర్ల పోస్ట్‌లను తరచుగా రీపోస్ట్ చేసే అకౌంట్‌లు ఇకపై సిఫార్సు చేయడం కుదరదని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది. దీని అర్థం, తరచుగా రీపోస్ట్ చేసే అకౌంట్‌ల పోస్ట్‌లు వారి ఫాలోవర్లకు చేరవచ్చు, కానీ అవి డిస్కవరీ ఫీచర్ ద్వారా కొత్త ప్రేక్షకులకు కనపించవు. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో డూప్లికేట్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ఎక్కువ మందికి చేరడానికి కంటెంట్ క్రియేటర్లు ఒరిజినల్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసేలా ప్రోత్సహిస్తుంది. ఒక యూజర్ ఇప్పటికే ఉన్న టెంప్లేట్ లేదా క్లిప్‌కు కొత్తగా ఏదైనా జోడిస్తే, అది ఒరిజినల్‌గా పరిగణిస్తామని కంపెనీ చెబుతోంది.

ఒక క్రియేటర్ పాత , మరొక క్రియేటర్ పోస్ట్‌కు వాటర్‌మార్క్ జోడించి, వీడియో వేగాన్ని మార్చి, ఇతర కంటెంట్ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తే, ఆ కంటెంట్ ఒరిజినల్‌గా పరిగణించబడదు అటువంటి పోస్ట్‌లు కొత్త ప్రేక్షకులకు చూపించడం కుదరదు. ప్రజలు ఫాలో అయ్యే ఖాతాల నుండి వచ్చే పోస్ట్‌లు వారి ఫీడ్‌లలో కనిపిస్తూనే ఉంటాయని, అయితే ఇతరుల కంటెంట్‌ను కేవలం రీపోస్ట్ చేసే క్రియేటర్ల రీచ్ తగ్గుతుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. కంటెంట్ నాణ్యతను మెరుగుపరచడానికి, అలాగే ఒరిజినల్ క్రియేటర్లకు ఎక్కువ రీచ్, ఎంగేజ్‌మెంట్ ఇవ్వడానికి ఈ మార్పు చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఇటీవల, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా తమ ప్లాట్‌ఫారమ్‌లు సుమారు 20 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినియోగదారులను కోల్పోయాయని మెటా పేర్కొంది. వినియోగదారులు తమ ఫీడ్‌లలో చూసే కంటెంట్‌తో అసంతృప్తిగా ఉన్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆ కంటెంట్ నాణ్యమైనదిగా గానీ, తమకు సంబంధితమైనదిగా గానీ లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా, వారు అనుసరించే క్రియేటర్ల నుండి కంటెంట్ వారికి చూపించడం లేదు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *