ఇన్వెర్టర్ ఏసీ, కన్వెర్టిబుల్ ఏసీల మధ్య ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. కూలింగ్, కరెంట్ ఆదాను చేయడంలో తేడాలు ఉన్నాయి. ఇన్వర్టర్ ఏసీలు గది ఉష్ణోగ్రత ఆధారంగా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కంప్రెసర్‌ను ఎప్పుడూ ఆన్, ఆఫ్ చేయకుండా సర్దుబాటు చేసుకుంటాయి. గది చల్లబడే కొద్ది టెంపరేచర్‌ను స్థిరంగా ఉంచడానికి వేగం తగ్గుతుంది. దీని వల్ల విద్యుత్ ఆదా అవ్వడంతో పాటు సౌండ్ కూడా తగ్గుతుంది.