తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా..? ఐశ్వర్యం కలగాలంటే ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..

తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకుంటున్నారా..? ఐశ్వర్యం కలగాలంటే ఈ పొరపాటు అస్సలు చేయొద్దు..


తమలపాకు.. భారతీయ సంస్కృతిలో ఒక పవిత్రమైన మొక్క.. పూజల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు, ఆయుర్వేదంలోనూ దీనిని శక్తివంతమైన ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది తమ ఇళ్లలో తమలపాకు చెట్టును పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తమలపాకు చెట్టు ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు, వాస్తు నియమాలు, సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకుందాం..

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

తమలపాకును ‘నాగవల్లి’ అని కూడా పిలుస్తారు. ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే శనీశ్వరుడికి తావు ఉండదని పండితులు చెబుతారు. ఇది అదృష్టాన్ని తెచ్చి, ఆర్థిక కష్టాలను దూరం చేస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. తమలపాకు తీగల్లో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారని ప్రతీతి. ప్రతిరోజూ నువ్వుల నూనె కలిపిన సింధూరంతో తమలపాకుపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ముందు ఉంచి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షం, ధైర్యసాహసాలు కలుగుతాయని విశ్వాసం. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ ఎంతో ప్రీతికరమైనది. నాగదోషాలతో బాధపడేవారు తమలపాకులతో ఆంజనేయుడిని పూజిస్తే శాంతి కలుగుతుందని చెబుతారు.

వాస్తు – దిశానిర్దేశాలు: తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించడం అవసరం. వాస్తు నిపుణుల ప్రకారం, ఈశాన్య భాగంలో (నార్త్-ఈస్ట్) ఎలాంటి బరువు ఉండకూడదు, మొక్కలు కూడా పెంచకూడదు. కాబట్టి తమలపాకు చెట్టును ఈశాన్య మూలలో పెట్టడం అశుభం. దక్షిణ దిశలో తమలపాకు చెట్టును పెంచుకోవడం అత్యంత శుభకరంగా భావిస్తారు. రావి, వేప, ఉసిరి చెట్ల వలె తమలపాకు కూడా శక్తివంతమైనదిగా ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనబడింది. నివేదనలు, దీపారాధన వంటి శుభకార్యాలకు తమలపాకును ఉపయోగిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు:

తమలపాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది:

శ్వాసకోశ సమస్యలు: శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు తమలపాకుకు నూనె రాసి, వేడి చేసి ఛాతీపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

స్త్రీలలో పాలు గడ్డ కట్టడం: బాలింతలలో పాలు గడ్డకట్టినప్పుడు తమలపాకుకు ఆముదం రాసి స్థనాలపై ఉంచితే నొప్పి తగ్గుతుంది.

సంరక్షణ పద్ధతులు:

తమలపాకు చెట్టును తులసి మొక్క వలె పవిత్రంగా భావించి శ్రద్ధగా చూసుకోవాలి.

స్థలం: తమలపాకు మొక్క వేడి, సూర్యరశ్మి ఉండే ప్రదేశాలలో బాగా పెరుగుతుంది.

నీరు: క్రమం తప్పకుండా నీరు పోయాలి.

ఎరువు: ప్రతి 20 రోజులకు ఒకసారి సేంద్రీయ ఎరువును అందించాలి.

పరిశుభ్రత: పాదు చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. కాగితాలు, ఇతర ఆకులు విసరకూడదు.

ఆకులు కోయడం: ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు కోయకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి.

తెగుళ్లు: ఎర్రటి పురుగులు వచ్చే అవకాశం ఉంది. వేపనూనెతో పిచికారీ చేయడం ద్వారా వీటిని నివారించవచ్చు. ఎప్పటికప్పుడు ఆకులను కత్తిరించడం వల్ల మొక్క మరింత ఏపుగా పెరుగుతుంది.

సరైన జాగ్రత్తలు, భక్తి శ్రద్ధలతో తమలపాకు చెట్టును పెంచుకుంటే ఇంటికి శుభం, శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *