Viral Video: ఏనుగు కోపాన్ని ఎప్పుడైనా చూశారా?.. కారును ఆటబొమ్మలా గాల్లో ఎలా విసిరికొట్టిందొ చూడండి!

Viral Video: ఏనుగు కోపాన్ని ఎప్పుడైనా చూశారా?.. కారును ఆటబొమ్మలా గాల్లో ఎలా విసిరికొట్టిందొ చూడండి!


ఓ ఏనుగు రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుపై దాడి చేసి దాన్ని ధ్వంసం చేసిన ఘటన కేరళలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక తెల్లటి కారు ఆ ఏనుగు కంటబడింది. అంతే వెంటనే ఆ గజరాజు కారుపై దాడికి దిగిండి. తన బలమైన తొండం, దంతాలతో కారును పైకి లేపి గాలిలో విసిరికొట్టింది. ఆ ఏనుగు బలానికి కారు ఒక చిన్న ప్లాస్టిక్ బొమ్మలా ఎగిరి పడటం చూసి అక్కడ ఉన్న జనాలంతా భయంతో దూరంగా పరుగులు పెట్టారు.

అంతటిలో ఆగకుండా ఆ ఏనుగు కారును అటు ఇటు తిప్పుతూ పూర్తిగా నుజ్జునుజ్జు చేసింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకవేళ ఎవరైనా లోపల ఉండి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. అయితే అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఈ వీడియో వైరల్ కావడంతో, వన్యప్రాణులతో వ్యవహరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది ఈ ఘటన మరోసారి హెచ్చరించింది. ఏనుగుల వంటి బలమైన జీవులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎలాంటి పనులు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.అయితే సాధారణంగా ఏనుగులు మద స్థితిలో ఉన్నప్పుడు లేదా వాటికి అసౌకర్యం కలిగించినప్పుడు మాత్రమే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనను ప్రదర్శిస్తాయని నిపుణులు అంటున్నారు.

వీడియో చూడండి..

అయితే కేరళలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అప్పుడు ఏనుగులు సృష్టించిన బీభత్సంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఏనుగులను ఉత్సవాల్లోకి తీసుకెళ్లడం, అధిక శబ్దాలు, జనసంచారం వాటిని ఒత్తిడికి గురిచేస్తాయని.. అందుకే కొన్ని సార్లు అవి ఇలా కోపంగా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *