ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే మరోవైపు హీరోగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు సత్య. మత్తు వదరలా 2తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అతను నటించిన తాజా చిత్రం జెట్లీ. రితేష్ రాణా తెరకెక్కించిన ఈ సినిమా మే01న రిలీజైంది. డీసెంట్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమాలో సత్యతో పాటు వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో నటించారు. అలాగే మిస్ యూనివర్స్ ఇండియా-2024 రియా సింఘా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జెట్లీ సినిమా సక్సెస్ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం (మే 02) సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో సత్యతో పాటు చిత్ర బృందమంతా హాజరైంది. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా నటుడిగా తన కెరీర్ కు ఎంతో సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
‘నా కెరీర్ లో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు చాలా మంది నుంచి సపోర్ట్ లభించింది. ముఖ్యంగా హీరో అవుతున్నానంటే నా తోటి హీరోల నుంచి, కో ఆర్టిస్టుల నుంచి వచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నా జర్నీలో ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, ఫోన్ చేసి తన బాగోగులు తెలుసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. నటుడు అజయ్ నాకు సొంత అన్నలాంటి వారు. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉండి, ఒక అన్నలా గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే నేను ఎప్పుడైనా డౌన్ లో ఉన్నా లేక ఒక సినిమా ప్లాప్ అయిందని డల్ గా ఉన్నా.. అజయ్ అన్న వెంటనే ఫోన్ చేసి చాలా ధైర్యం చెప్పేవారు. ఆయన ఇచ్చిన ధైర్యం వల్లే మళ్లీ నేను పుంజుకోగలిగాను’ అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు సత్య. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
కాగా జెట్లీ తర్వాత కూడా సత్య చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను రామ్ చరణ్ నటిస్తోన్న పెద్దిలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా పెద్ది రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్నారు.
జెట్లీ సినిమా ప్రమోషన్లలో సత్య.. వీడియో
తన సొంత సినిమా #JETLEE కి టిక్కెట్లు అమ్ముతున్న #Satya 😮 pic.twitter.com/2sZnHEsTet
— Movies4u Official (@Movies4u_Officl) May 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.