Suthivelu: స్టార్ హీరోలతో సినిమాలు.. ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. చనిపోయినా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లలేదు..

Suthivelu: స్టార్ హీరోలతో సినిమాలు.. ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. చనిపోయినా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లలేదు..


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశారు సుత్తివేలు. అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. 1947, ఆగస్టు 7న జన్మించిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో ఆయన పోషించిన ‘సుత్తి’ అనే పాత్ర విపరీతమైన ప్రజాదరణ పొందింది. అప్పటి నుండి ఆయన ‘సుత్తివేలు’గా స్థిరపడిపోయారు.1981లో ‘ముద్దమందారం’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. సుమారు 200కు పైగా చిత్రాలలో నటించారు. నాలుగు స్తంభాలాట, రెండుజెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి, ప్రతిఘటన, కలికాలం, వందేమాతరం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలలో ఆయన నటనతో మెస్మరైజ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

ఆయన తన నటనకు గానూ నాలుగు సార్లు నంది అవార్డులను అందుకున్నారు. ‘వందేమాతరం’ సినిమాకు గానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు పొందారు. తెలుగు తెరపై సుత్తివేలు, శ్రీలక్ష్మిల కాంబినేషన్ అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య జోడిలలో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన జ్వాల సినిమాలో ఆయన నటన గురించి చెప్పక్కర్లేదు. అలాగే స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రంల్లో నటించారు. అయితే సినీరంగంలో తనదైన ముద్ర వేసిన సుత్తివేలు.. 63 ఏళ్ల వయసులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 2012లో గుండెపోటుతో మరణించారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన భార్య లక్ష్మీ రాజ్యం మాట్లాడుతూ.. మరణించే ముందు రోజు రాత్రి అందరితో కలిసి భోజనం చేశారని.. మరుసటి రోజు భీమవరంలో నాటక ప్రదర్శనల కోసం ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. కానీ తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో ప్రాణాలు విడిచారని అన్నారు. ఆయన మరణవార్త ఆలస్యంగా బయటకు రావడంతో చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు చివరి చూపు చూసుకోలేకపోయారని అసలు కారణం వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా తీసి తప్పు చేశాను.. అది ఒక పొరపాటు మాత్రమే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *