కన్నడ నటుడు డాలీ ధనంజయ్ తెలుగు సినీ అభిమానులకు కూడా సుపరిచితమే. పుష్ప, పుష్ప 2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అందులో అతను పోషించిన జాలి రెడ్డి పాత్ర బాగా హైలెట్ అయ్యింది. దీంతో పాటు సత్యదేవ్ తో కలిసి జీబ్రా అనే సినిమాలోనూ హీరోగా నటించాడు డాలీ. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలోనూ ఓ కీలక పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు డాలీ. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ నటుడు గతేడాది ఫిబ్రవరిలో ధన్యత అనే డాక్టరమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరి తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా తమ జీవితంలోకి ఒక పండంటి బిడ్డను ఆహ్వానించారు. డాలీ భార్య శనివారం (మే 01) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను డాలీనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కుమారుడి చిన్ని చేతుల ఫోటోను పంచుకుంటూ, తండ్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందని మురిసిపోయాడు. ప్రస్తుతం, తల్లి ధన్యత, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాలీ వెల్లడించాడు.
ప్రస్తుతం డాలీ ధనంజయ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డాలీ ధనుంజయ్, ధన్యత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగాకన్నడలో స్టార్ హీరో కమ్ నిర్మాతగా వెలుగొందుతోన్న డాలీ ధనంజయ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ గానే ఉంది. ఇక పుష్ప, పుష్ప2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లోనూ ఫేమస్ అయ్యాడీ హీరో.
ఇవి కూడా చదవండి
డాలీ ధనంజయ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..
ఇక ప్రొఫెషనల్ కెరీర్ పరంగానూ వరుసగా విజయాలు అందుకుంటున్నాడు డాలీ. ఇటీవల అతను నిర్మించిన ‘జిరాక్స్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం అ ‘హలగలి’, ‘666 ఆపరేషన్ డ్రీమ్ ప్రాజెక్ట్’, ‘జింగో’, ‘అన్నా ఫ్రమ్ మెక్సికో’, ‘ఉత్తరకాండ’ చిత్రాల్లో నటిస్తున్నాడు డాలీ. అలాగే ‘హెగ్గన ముద్దు’ సహా మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నాడు.
భార్యతో పుష్ప విలన్ జాలి రెడ్డి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.