Women’s T20 World Cup 2026 India Squad: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన పవర్ ఫుల్ జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో అనుభవజ్ఞులైన ప్లేయర్లతో పాటు యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఈసారి ప్రపంచ కప్ జట్టులో ఇద్దరు తెలుగు క్రీడాకారిణులు చోటు సంపాదించుకోవడం గమనార్హం.
టీమ్ ఇండియా స్క్వాడ్:
భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కెప్టెన్: హర్మన్‌ప్రీత్ కౌర్
వైస్ కెప్టెన్: స్మృతి మంధాన
బ్యాటర్లు: షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి
వికెట్ కీపర్లు: రిచా ఘోష్, యస్తికా భాటియా
ఆల్ రౌండర్లు: దీప్తి శర్మ, శ్రీ చరణి (తెలుగు ప్లేయర్), నందిని శర్మ
బౌలర్లు: రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి (తెలుగు ప్లేయర్), క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.
మెరిసిన తెలుగు తేజాలు..
ఈ మెగా టోర్నీకి ఎంపికైన జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉండటం తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు గర్వకారణం.
అరుంధతి రెడ్డి: సీనియర్ పేసర్ అరుంధతి రెడ్డి తన నిలకడైన ప్రదర్శనతో మరోసారి ప్రపంచ కప్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీయగల సామర్థ్యం ఆమె సొంతం.
శ్రీ చరణి: యువ ఆల్ రౌండర్ శ్రీ చరణికి ఈ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడం ఒక విశేషం. దేశవాళీ క్రికెట్, రీసెంట్ సిరీస్‌లలో తన ప్రతిభను నిరూపించుకోవడంతో సెలక్టర్లు ఆమెకు మొగ్గు చూపారు.
టోర్నీ షెడ్యూల్, గ్రూపులు: జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత్ గ్రూప్ 1లో ఉంది. మన జట్టుతో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఈ గ్రూపులో తలపడనున్నాయి.
భారత్ vs పాకిస్థాన్: జూన్ 14 (ఎడ్జ్‌బాస్టన్)
భారత్ vs నెదర్లాండ్స్: జూన్ 17 (హెడింగ్లీ)
భారత్ vs దక్షిణాఫ్రికా: జూన్ 21 (ఓల్డ్ ట్రాఫోర్డ్)
భారత్ vs బంగ్లాదేశ్: జూన్ 25 (ఓల్డ్ ట్రాఫోర్డ్)
భారత్ vs ఆస్ట్రేలియా: జూన్ 28 (లార్డ్స్)
గతేడాది వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన టీమ్ ఇండియా, ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో కూడా విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..