Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

Telangana: సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!


ఈ నెల 4 సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర అభివృద్ధి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలు ప్రధానంగా అజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కేబినెట్‌లో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, సాంకేతిక అంశాలు, అవసరమైన మార్పులపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చించనున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అంశం నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్స్‌పై కేబినెట్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా RTC ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విధానంపై చర్చించనున్నారు.

సంక్షేమ రంగంలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు అంశంపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీల మేరకు కేకే, కోదండరాం కమిటీ విధివిధానాలపై చర్చించనున్నారు.ఇందిరమ్మ భీమా పథకం అమలు పై కూడా కీలకంగా చర్చించనున్నారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

ఈ అంశాలతో పాటు ఇతర పరిపాలనా, అభివృద్ధి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *