కింగ్‌ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం

కింగ్‌ మేకర్ అవ్వాల్సిన హీరో.. ఫేడవుట్ అయ్యాడంటే ఆ తప్పే కారణం


దర్శకుడు విజయ భాస్కర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటుడు తరుణ్ కెరీర్, అతని ప్రస్తుత స్థితిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తరుణ్ ఒకప్పుడు లవ్ స్టోరీస్‌తో సంచలనం సృష్టించాడని, అయితే తర్వాత అతని కెరీర్ ఎందుకు మందగించిందనే ప్రశ్నకు సమాధానమిస్తూ కీలక విషయాలను వెల్లడించారు విజయ్‌ భాస్కర్. యాక్షన్ సినిమాలు చేయవద్దని తాను అప్పట్లోనే తరుణ్‌కు సలహా ఇచ్చినట్లు విజయ భాస్కర్ గుర్తు చేసుకున్నారు. తరుణ్‌కు ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నారని, వారు అతనిని రొమాంటిక్ , డ్రామా చిత్రాలలో చూడటానికే ఇష్టపడతారని అభిప్రాయపడ్డారు. దీనికి ఉదాహరణగా, అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద హీరోల సినిమాలు విజయం సాధిస్తున్నప్పటికీ, అమోల్ పాలేకర్ వంటి నటులు చోటీ సి బాత్, చిట్చోర్ వంటి క్లాసిక్ చిత్రాలతో విశేష ఆదరణ పొందారని ఆయన వివరించారు. ప్రతి నటుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని, ఇతరులను అనుకరించడం అనవసరమని ఆయన అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, తరుణ్ యాక్షన్ సినిమాల కోసం వేచి చూడటం సరైన నిర్ణయం కాదని భాస్కర్ చెప్పుకొచ్చారు. తరుణ్ తెలివైన నటుడని, మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవని, కానీ సరైన స్క్రిప్ట్ దొరికితే ఎవరైనా ఎప్పుడైనా తిరిగి రాగలరని అన్నారు. నటి రోజా రమణితో మాట్లాడినప్పుడు ఆమె కూడా మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారని విజయ భాస్కర్ ప్రస్తావించారు. భవిష్యత్తులో విజయ భాస్కర్-తరుణ్ కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నకు, అదంతా స్క్రిప్ట్‌పైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక స్క్రిప్ట్ కరెక్ట్‌గా సెట్ అయితే, అది తనంతట తానుగానే దర్శకుడిని, నటుడిని పిలుస్తుందని జిలేబి వంటి చిత్రాలను ఉదాహరణగా చూపారు. సరైన కథ కుదిరితే, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా

పాదాల్లో వచ్చే ఈ మార్పులకు అర్థం ఏంటో తెలుసా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *