Headlines

Tollywood : ఏంటీ సర్ మీరు.. 76 ఏళ్ల వయసులో 15 ట్రైసెప్ డిప్స్ చేసిన సీనియర్ నటుడు.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..

Tollywood : ఏంటీ సర్ మీరు.. 76 ఏళ్ల వయసులో 15 ట్రైసెప్ డిప్స్ చేసిన సీనియర్ నటుడు.. నెటిజన్స్ కామెంట్స్ చూస్తే..


వయస్సు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ జాబితాలో బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పటేకర్ ఇప్పుడు మొదటి వరుసలో నిలిచారు. సాధారణంగా 70 ఏళ్లు దాటిన తర్వాత విశ్రాంతి కోరుకునే వారు ఎక్కువ, కానీ నానా పటేకర్ మాత్రం జిమ్‌లో కుర్రాళ్లకు సవాల్ విసిరేలా వర్కవుట్లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్, నిర్మాత అతుల్ కస్బేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో నానా పటేకర్ ఏమాత్రం తడబడకుండా, చాలా సునాయాసంగా 15 ట్రైసెప్ డిప్స్ (Tricep Dips) తీశారు.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

తెలుపు రంగు బనియన్, షార్ట్స్ ధరించి, మెడలో తన ట్రేడ్‌మార్క్ తువ్వాలు వేసుకుని ఆయన చేసిన ఈ వర్కవుట్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అతుల్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “నానా సాహెబ్.. మీరు నా ఫిట్‌నెస్ గోల్స్‌ను మార్చుకునేలా చేశారు. ఆయనకు 76 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నాను” అని రాసుకొచ్చారు.  నా పటేకర్ ఎనర్జీని చూసి కేవలం సామాన్య ప్రజలే కాదు, సినీ సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా శెట్టితో పాటు రాహుల్ దేవ్ వంటి తారలు ఈ వీడియోపై స్పందిస్తూ ఆయన అంకితభావాన్ని కొనియాడారు. నానా పటేకర్ ఐకానిక్ క్యారెక్టర్ ‘ఉదయ్ శెట్టి’ (వెల్కమ్ మూవీ) డైలాగులను గుర్తు చేస్తూ.. “కంట్రోల్ ఉదయ్ కంట్రోల్.. ఇంకా అంత ఫిట్‌గా ఎలా ఉన్నారు?” అంటూ అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

నానా పటేకర్ ఎప్పుడూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని గడుపుతుంటారు. సాదాసీదా ఆహారం, నిరంతర శారీరక శ్రమ ఆయనను ఈ వయస్సులోనూ దృఢంగా ఉంచాయి. ఇటీవల ఆయన ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు. అలాగే 2025-26 లో ‘హౌస్‌ఫుల్ 5’ వంటి భారీ ప్రాజెక్టులతోనూ బిజీగా ఉన్నారు. వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా, ఆరోగ్యం పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *