ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్

ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్న టీచర్.. సరికొత్త పాత్రలో సిమ్రాన్


కంటెంట్ ఉన్న సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి.ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు దర్శకనిర్మాతలు. పెద్ద హీరోలు, దర్శకులు కూడా కొత్త కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఆసక్తి సినిమా తెరకెక్కుతుంది.. ఆ సినిమా పేరే టీచర్.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న భామల్లో సిమ్రాన్ ఒకరు. సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి సిమ్రాన్ వైవిధ్యమైన పాత్రలను చేస్తూ అలరిస్తున్నారు సిమ్రాన్. ఇక ఇప్పుడు సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీచర్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ టాకీస్ బ్యానర్లపై కాశీ విశ్వనాథన్, సమీర్ భరత్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఈ సినిమాలో సిమ్రాన్ టీచర్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో హిస్టరీ లెసన్స్ కాస్త ‘డార్క్’గా ఉండబోతున్నాయని అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా టైటిల్ లోగో చాలా ఆసక్తికరంగా ఉంది. చాక్‌పీస్‌తో పాటు గన్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా ఆకట్టుకునే కథతో పాటు యాక్షన్ సీన్స్ తో పాటు సైకలాజికల్ డ్రామా ఉండనుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ విడుదల చేయనున్నారు. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *