Gujarat Titans vs Royal Challengers Bengaluru Result: ఐపీఎల్ 2026లో భాగంగా 42వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు అందించిన 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 3 ఓవర్లు ఉండగానే ఛేదించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఏ బ్యాట్స్మెన్ కూడా అర్ధశతకం సాధించలేకపోయాడు. బెంగళూరుకు చెందిన దేవదత్ పడిక్కల్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 28 పరుగులకు, కెప్టెన్ రజత్ పాటిదార్ 19 పరుగులకు అవుటయ్యారు. అర్షద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్లు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. సిరాజ్, రబాడాలు చెరో వికెట్ తీశారు. ఒక బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యాడు.
ఇరు జట్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్.
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్.
ఇంపాక్ట్ ప్లేయర్: రాహుల్ తెవాటియా.