Telangana: తెలంగాణలో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జ్.. ఎక్కడంటే..?

Telangana: తెలంగాణలో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జ్.. ఎక్కడంటే..?


Telangana: తెలంగాణలో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జ్.. ఎక్కడంటే..?

తెలంగాణలో కొత్త టూరిస్టు ఆకర్షణ రూపుదిద్దుకుంటోంది. ప్రారంభానికి ముందే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్… సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ వద్ద ప్రత్యేకంగా నిర్మిస్తున్న హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జ్. రాష్ట్రంలో ఇదే మొదటిసారి ఈ తరహా నిర్మాణం చేపడుతుండటం విశేషం. ఎల్లమ్మ చెరువుపై నిర్మాణంలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఆధునిక సాంకేతికతతో రూపొందుతోంది. పారదర్శక గాజు పలకలతో నిర్మాణం కావడంతో, సందర్శకులు బ్రిడ్జ్‌పై నడుస్తూ కిందనున్న చెరువును నేరుగా చూడగలరు. ఇది ఒకవైపు ఉత్సాహాన్ని కలిగిస్తే… మరోవైపు కొంత భయానక అనుభూతిని కూడా ఇస్తుంది. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత దాని ఆకృతిలోనే ఉంది. హార్ట్‌ షేప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం కేవలం ఇంజినీరింగ్ అద్భుతమే కాకుండా… జంటలకు, ఫోటోగ్రఫీ ప్రియులకు ఆకర్షణీయంగా మారనుంది. సోషల్ మీడియాలో షేర్ చేసుకునేలా ఇన్‌స్టాగ్రామ్ స్పాట్‌గా నిలిచే అవకాశముంది.

సిటీకి దగ్గరలోనే వీకెండ్ డెస్టినేషన్

సిద్ధిపేట జిల్లా హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల, నగర వాసులకు ఇది సులభమైన వీకెండ్ గెట్‌వేగా మారనుంది. రోడ్డు, రైలు మార్గాలు మెరుగుపడటంతో ఈ ప్రాంతానికి చేరుకోవడం మరింత సౌకర్యవంతమైంది. ఇంకా నిర్మాణం పూర్తికాకముందే, డ్రోన్ ద్వారా తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు ప్రయాణ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతూ… ప్రారంభం కోసం ఎదురు చూపులను పెంచుతున్నాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌తో ప్రాంతీయ పర్యాటకానికి కొత్త ఊపిరి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కుటుంబాలు, జంటలు, ట్రావెల్ లవర్స్‌కు ఇది ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. చెరువు అందాలు, ప్రశాంత వాతావరణం, ఆధునిక డిజైన్.. ఇలా అన్ని కలిపి ఈ ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్టు స్పాట్ నిలబెట్టే అవకాశముంది.

అయితే, ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణ దశలోనే ఉంది. ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ, ముందుగానే ఏర్పడిన క్రేజ్ దాని ప్రాధాన్యతను చూపిస్తోంది. హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, సిద్ధిపేట జిల్లాను తెలంగాణ టూరిజం మ్యాప్‌లో మరింత బలంగా నిలబెట్టే అవకాశం ఉంది. కొత్త అనుభూతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారనుంది.

 

View this post on Instagram

 

A post shared by Tarun Thakur (@thakur.tarunn)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *