పిల్లలు స్కూల్‌కు వెళ్లేవరకు, స్కూల్ నుంచి వచ్చాక పడుకునే వరకు టీవీ రిమోట్లో లేదా ఐప్యాడ్‌లో, ఫోన్లో పట్టుకునే ఉంటున్నారు. అమెరికాలో దీనికి చెక్ పెట్టేందుకు ఓ అద్భుత గాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది ఓ కంపెనీ. దీంతో చిన్నారులు స్మార్ట్ డివైజ్‌లను పక్కన పెట్టి.. పాతకాలం నాటి ల్యాండ్‌లైన్ ఫోన్లను పోలి ఉండే టిన్ క్యాన్ని ఇష్టపడుతున్నారు. కేవలం 100 డాలర్లుకు వచ్చేసే టిన్ క్యాన్ ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. 2025 ఏప్రిల్‌లో లాంఛ్ అయిన ఈ ఫోన్.. గత ఏడాది కాలంలో లక్షలాది సంఖ్యలో అమ్ముడైంది. ఇది చూడటానికి పాతకాలం ఫోన్ లాగా ఉన్నా.. లోపల మాత్రం వైఫై సాంకేతికతతో పని చేస్తుంది. ఇందులో ఉండే అద్భుత ఫీచర్ల కారణంగా స్మార్ట్ఫోన్ల వల్ల కలిగే స్క్రీన్ అడిక్షన్ తగ్గుతోంది. పిల్లలను ఫోన్లు, టీవీలు, ఐపాడ్లు చూడకుండా, వాటికి బానిసలు అవ్వకుండా వాటి బారి నుంచి రక్షించడానికి ఇదొక అద్భుత మార్గంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందులో ఎటువంటి స్క్రీన్ ఉండదు. కాబట్టి సోషల్ మీడియా లేదా ఇతర వీడియో గేమ్స్ ఆడే అవకాశం ఉండదు. ఈ ఫోన్ వాడటం వల్ల తమ పిల్లల ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చిందని పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. “వారు ఇప్పుడు ఇతరులు చెప్పేది ఓపికగా వింటున్నారు. మరింత ఆలోచించి మాట్లాడుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది” అంటున్నారు. టిన్ క్యాన్ సీఈఓ చెట్ కిటిల్సన్ ఏం చెప్పారో తెలుసా? నేటి తరం పిల్లలు కేవలం టెక్స్ట్ మెసేజ్‌లు, వీడియో కాల్స్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కోల్పోతున్నారని, మాటల మధ్య వచ్చే నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యమని అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని విద్యాసంస్థలు కూడా ఈ ఫోన్ల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. వేల సంఖ్యలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్లు టిన్ క్యాన్ ఫోన్ల కోసం బల్క్ ఆర్డర్లు ఇస్తున్నారు. . అమెరికాలో వస్తున్న ఈ మార్పు ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించింది. ఇతర దేశాలు కూడా దీనిపై సీరియస్ గానే ఆలోచిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rama Prabha: హీరో ఛాన్స్ ఇప్పిస్తే వదిలేశాడు.. అతడికి చాలా బలుపు
కావిడి కట్టి.. తల్లిని మోసి.. 3 నెలలు 24 రోజుల పాటు 1,800 కి.మీ నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
LPG Gas Cylinder: మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల షాక్ !!
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..