సర్వపిండికి కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి కాడలు, పచ్చి శనగపప్పు, రుచికి సరిపడ నూనె, కరివేపాకు.
తయారీ విధానం : ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. దానిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. సర్వపిండి పెట్టడానికి రెండు గంటల మందు శనగపప్పు నానబెట్టుకోవాలి. అలాగే పచ్చి మర్చి, ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వు లైటుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన వేరుశనగలు, పల్లీలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి కాడలు తరిగినవి, అన్నీ వేయాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసి, కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ మంచిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. చివరలో కొంచెం నూనె పోసి మంచిగా పిండి కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు సర్వపిండి బౌల్స్ తీసుకోవాలి. అందులో వన్ టీ స్పూన్ నూనె పోసి, మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆ బౌల్స్ ఆకారం, సర్వపిండి ఆకారంలో చేతులతో మంచిగా ఒత్తుకోవాలి. ఇలా చేతి వేళ్లతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వలన సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూడు లేదా నాలుగు బౌల్స్కు సర్వపిండి మంచిగా పెట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, మనం సర్వపిండి ఆకారంలో ఒత్తుకున్న బౌల్స్ , స్టవ్ పై పెట్టాలి. సన్నని మంటపై సర్వ పిండి మొత్తం కాలే విధంగా చూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత సర్వ పిండి పై మూత తీసి, దానిని చుట్టూ తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వలన అంచుల వైపు ఉన్న పిండి మొత్తం మంచిగా కాలుతుంది. అలాగే తీసే ముందు కూడా చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కాలిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చి మిర్చి కారం సర్వపిండి రెడీ.




