Tollywood: రజనీకాంత్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది

Tollywood: రజనీకాంత్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎంతలా మారిపోయింది


పై ఫొటోలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ చేసింది. అయితే ఆ తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు సినిమాలకు విరామం ఇచ్చింది. చెన్నైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ బెంగళూరులో పెరిగింది. కామర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంది. పలు బ్రాండెడ్ ఉత్పత్తుల ప్రకటనల్లోనూ యాక్ట్ చేసింది. ఇదే క్రమంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట సహాయక నటి, చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించింది. . 2014లో విడుదలైన ఈ సినిమాలో అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. అయితే అందులో సోనాక్షి పక్కన ఓ చిన్న పాత్రలో ఈ బ్యూటీ కనిపించింది. పై ఫొటో ఆ సినిమా షూటింగ్ టైమ్ లోదే. కట్ చేస్తే.. కొన్నేళ్లకు ఈ సైడ్ యాక్టరే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. రెండేళ్ల క్రితం ఈ బ్యూటీ నటించిన ఒక తెలుగు సినిమా ఏకంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది.

పై ఫొటోలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఉన్నది మరెవరో కాదు ‘హనుమాన్’ హీరోయిన్ అమృతా అయ్యర్. విజయ్ బిగిల్ సినిమాతో పాపులర్ అయిన అమృతా రామ్ పోతినేని రెడ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అర్జుణ ఫాల్గుణ, కాఫీ విత్ కాదల్, హనుమాన్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ బ్యూటీకి అందం, అభినయం పుష్కలంగా ఉన్నాయి. అయినా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు సరైన అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది. చివరిగా 2024లోనే రిలీజైన అల్లరి నరేష్ సినిమా బచ్చలమల్లి హీరోయిన్ గా నటించింది అమృతా. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ హీరోయిన్ యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అమృతా అయ్యర్ లేటెస్ట్ ఫొటోస్..

విజయ్ విజిల్ సినిమాలో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *