బంపర్‌ ఆఫర్‌.. సిమ్‌ కొంటే పెట్రోల్‌ ఫ్రీ

బంపర్‌ ఆఫర్‌.. సిమ్‌ కొంటే పెట్రోల్‌ ఫ్రీ


ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడమే తెలివైన పని. అలాంటి పనే చేస్తోంది ఓ టెలికాం సంస్థ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలు కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెట్రోల్ కొరతను ఓ టెలికాం సంస్థ వినూత్నంగా తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌టెల్ ప్రతినిధులు సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చారు. తమ కంపెనీ సిమ్ తీసుకున్న వారికి లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్న తరుణంలో.. సామాన్యుల అవసరాన్ని గుర్తించిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు, ఏకంగా ‘ఫ్రీ పెట్రోల్’ ఆఫర్‌తో మార్కెటింగ్ వ్యూహాన్ని మార్చేశారు. ఈ ఆఫర్ ప్రకారం.. ఎయిర్‌టెల్ కొత్త కనెక్షన్ తీసుకున్నా లేదా ఇతర నెట్‌వర్క్ నుంచి పోర్ట్ అయినా, రూ.350 రీచార్జ్‌తో పాటు ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్నారు. పెట్రోల్ దొరకక సతమతమవుతున్న వాహనదారులు, ఈ అవకాశాన్ని చూసి ఎయిర్‌టెల్ కౌంటర్లకు భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. “అవసరాన్ని అవకాశంగా మార్చుకోవడమంటే ఇదే” అంటూ నెటిజన్లు ఈ వినూత్న మార్కెటింగ్ ట్రిక్‌ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కంపెనీ తన కస్టమర్లను పెంచుకోవడానికి ఎంచుకున్న ఈ మార్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా, వైరల్‌గా మారింది. పెట్రోల్ దొరక్క అల్లాడుతున్న టైమ్‌లో ఈ ఆఫర్ నిజంగానే వాహనదారులకు బంపర్ బోనస్‌గా మారింది!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Divvela Madhuri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మాధురి..

సాక్షి ధోనీ ధరించిన.. వాచీ ధర రూ. 3.1 కోట్లు!

భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్‌

పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..

వేసవిలోనూ మీ జుట్టును కాపాడుకోండి ఇలా..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *